చంద్రలత ఒక తెలుగు రచయిత్రి,, అధ్యాపకురాలు. 1997 లో ఈమె రాసిన రేగడి విత్తులు అనే నవలకు తానా వారి బహుమతి లభించింది.[1] ఇంకా ఈమె పలు కథా సంకలనాలు వెలువరించింది. ప్రభవ అనే పేరుతో చిన్న పిల్లల బడి నిర్వహిస్తోంది.

చంద్రలత
నివాసంనెల్లూరు
వృత్తిరచయిత్రి, అధ్యాపకురాలు

జీవితంసవరించు

ఈమె కోస్తా ఆంధ్రలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. తెలంగాణాలోని ఆంధ్రాక్యాంపులో పెరిగింది. నెల్లూరులో స్థిరపడింది.[2]

రచనలుసవరించు

ఈమె 1993 నుంచి కథలు రాస్తూ ఉంది. ఇవి పలు తెలుగు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 1994 లో నార్ల వారి పురాణ వైరాగ్యం పూరణ చేసింది. నేనూ నాన్ననవుతా అనే పేరుతో 25 కథల సంకలనం రాసింది. ఆమె మొదటి నవల 1996 లో వచ్చిన వర్థని. 1997 లో వచ్చిన రేగడి విత్తులు అనే నవలకు తానా పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది.

నవలలుసవరించు

 • వర్థని (1996)
 • రేగడివిత్తులు (1997)
 • దృశ్యాదృశ్యం (2003)

కథా సంపుటాలుసవరించు

 • నేనూ నాన్ననవుతా (1996)
 • ఇదం శరీరం (2004)
 • వివర్ణం (2007)

బాల సాహిత్యంసవరించు

 • విరిగిన అల (2005)
 • పిల్లన గ్రోవి (2006)
 • పట్టు పువ్వులు (2006)
 • ప్రియమైన అమ్మా నాన్నా! (2006)

సాగు , ఇతర విషయాలుసవరించు

 • సస్యపథం
 • తెలుగు వ్యవసాయ శాస్త్రవేత్తల జీవన పదం (2009)
 • చేపలెగరా వచ్చు (2009)
 • ఇతనాల కడవకు ఈబూది బొట్లు (2010)
 • వచ్చే దారెటు (2010)
 • మడతపేజీ (2010)

మూలాలుసవరించు

 1. "రేగడి విత్తులు – చంద్రలత". pustakam.net. 11 June 2014. Retrieved 11 May 2018.
 2. K. N, Murali Sankar (3 March 2014). "'Novel' link to bifurcation". thehindu.com. The Hindu. Retrieved 11 May 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=చంద్రలత&oldid=2885318" నుండి వెలికితీశారు