చక్రపాణి రంగనాథుడు

దస్త్రం:Chakrapani ranganathudu (చక్రపాణి రంగనాథుడు).jpg
సద్యప్రసాది, కవిరాజ శ్రీ చక్రపాణి రంగనాథ స్వామి వారు
చక్రపాణి రంగనాథుడు

జీవితం

మార్చు

చక్రపాణి రంగనాథుడు తొలి జీవితంలో వైష్ణవుడు. ఇతను మత విషయంలో పాల్కురికి సోమనాథునితో వాదన పడుతుంది. శివుడు కాని వాడిని కంటితో కూడా చూడను అనే నియమం ఉండటం వల్ల తెరచాటున ఉండి సోమనాథుడు, తన కుమారుడయిన చతుర్ముఖ బసవేశ్వరుణ్ణి ముందు ఉంచుకోని వాదనలో పాల్గొంటాడు. ఇద్దరికీ గొప్ప వాదన జరిగింది, రంగనాథుడు ఓడిపోతాడు! పరాజయ దు॰ఖంతో ఇంటి దారి పట్టి దారిలో వచ్చిన శ్రీశైలం శ్రీశైల మల్లిఖార్జునుడిని దర్శించుకోలేదట! దానితో రంగనాథుని రెండు కళ్ళు పొయినాయట! అహోబిళంలోని నరసింహస్వామిని ప్రార్థిస్తే ఆ స్వామి కలలో కన్పడి శివుని గొప్పదనాన్ని చెపితే సిగ్గుతో శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునుణ్ణి పూజిస్తాడు. అప్పుడొక కన్ను వస్తుంది, తరువాత సోమనాథున్ని క్షమాపణ వేడుకుంటే రెండవ కన్ను వచ్చిందట! ఈ వృత్తాంతం మొత్తం కన్నడ పుస్తకం అయిన సోమనాథపురాణం (రచన: విరక్త తొంటెదార్యుడు) నందు వివరింపబడినది.

ఇతనికి కన్నులు ఓ సారి పొయి మరల వచ్చినట్టు ఇతని రచనల ద్వారా కూడా రూఢీ అవుతుంది.

ఇతను రచించిన కంటి రగడనందు:

నయముగా నయనములు నా కీయ బొడగంటి
భయభక్తు లీ భర్గు పాదములు పొడగంటి

అని చెప్పినాడు.

సోమనాథునితో వాదన కూడా నిజమే అని ఈ దిగువ పంక్తులు రూఢీ చేస్తాయి.

త్రిభువనము భక్తులకు దృణకణములని కంటి
సభలందు భక్తులకు జయవాద మని కంటి

రచనలు

మార్చు
  1. శ్రీశైల మల్లికార్జునుని పేర 500 సీస పద్యాలు.
  2. శ్రీశైల మల్లికార్జునుని పేర 8000 పద్యాలున్న మరో గ్రంథం
  3. వేయి పాదాలు గల దండకం, శ్రీశైల మల్లికార్జునునిపైనే
  4. ఒక తారావళి
  5. నాలుగు లయగ్రాహులు
  6. ఒక వృత్తశతకం
  7. వేయి దోధకవృత్తాలు
  8. నూరు తోటకవృత్తాలు
  9. ఏడు రగడలు
  10. 3000 మత్తకోకిలలు
  11. 600 గీతపద్యాలు
  12. 8 మంజరులు
  13. 500 కందాలు
  14. 36 గద్యలు
  15. 36 ఉభయ శతకాలు

ఈ కృతులన్నీ ఇప్పుడు దొరకవు, కానీ ఇన్ని వ్రాయడానికి కారణం మాత్రం తెలుస్తుంది! కళ్ళు పొయి వచ్చిన తరువాత తన ఎత్తు కృతులు సమర్పిస్తానని మొక్కుకున్నాడట! దానికే ఇలా వందలూ వేలూ పద్యాలు రచించినాడట. ఇతని నయన రగడ నుండే మరి కొన్ని లైన్లు - ఈ మొక్కు గురించి వివరిస్తూ:

ఇంక శ్రీగిరి జేర నేగందు నని కంటి
కరుని కృపవడయ సమయ మిది యని కంటి
నికను నాయెత్తు కృతు లిత్తునని పొడగంటి
క గృతుల్ చెప్ప నా కేమి భయమని కంటి
డి గృతుల్ నాయెత్తు వచ్చునని పొడగంటి
మృడు డింక నా కృతుల్ మెచ్చునని పొడగంటి

రంగనాథ రామాయణం కర్తా?

మార్చు

కొంతమంది రంగనాథ రామాయణం కూడా చక్రపాణి రంగనాథుడే రచించినాడని భావిస్తూ వచ్చారు, కానీ రాంగనాథ రామాయణంలోనే ఈ గ్రంథాన్ని గోన బుద్ధభూపతి తన తండ్రి పేరుమీదుగా రచించినట్లు చెప్పినాడు. అందువల్ల ఈ చక్రపాణి రంగనాథుడు రంగనాథ రామాయణాన్ని రచించలేదు అని చెప్పవచ్చు.

ఆధారాలు

మార్చు
  1. ఆరుద్ర రచించిన సమగ్ర ఆంధ్రసాహిత్యం రెండవ భాగం.