చక్రేశ్వరి శివాలయం

చక్రేశ్వర శివాలయం ఒడిషా రాష్ట్రానికి చెందిన భువనేశ్వర్ లో ఉన్న శైవ ఆలయం. దీనిని 10-11 వ శతాబ్దాలలో నిర్మించారు. ఇది భువనేశ్వర్ నగరంలోని హతియాసుని మార్గంలో ఉంది. శివ లింగం గర్భగుడి లోపల వృత్తాకార యోనిపీఠంలో ఉంది. ఈ దేవాలయం చుట్టూ తూర్పు, ఉత్తరం ప్రైవేటు నివాస భవనాలు, పడమర వైపు చక్రేశ్వర కొలను ఉన్నాయి. ఈ దేవాలయంలో శివరాత్రి, దీపావళి , సంక్రాంతి వంటి పండగలలో వివిధ ఆచారాలు గమనించవచ్చు. ఈ దేవాలయంలో రుద్రాభిషేకం, చంద్రాభిషేకం వంటి పవిత్ర కార్యక్రమాలు జరుగుతుంటాయి.

చక్రేశ్వరి శివాలయం
చక్రేశ్వరి శివాలయం is located in Odisha
చక్రేశ్వరి శివాలయం
చక్రేశ్వరి శివాలయం
ఒడిశాలో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :20°14′27″N 85°50′12″E / 20.24083°N 85.83667°E / 20.24083; 85.83667Coordinates: 20°14′27″N 85°50′12″E / 20.24083°N 85.83667°E / 20.24083; 85.83667
ప్రదేశం
దేశం:భారతదేశము
రాష్ట్రం:ఒడిశా
ప్రదేశం:భువనేశ్వర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు
ప్రధాన దేవత:పార్వతి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :కళింగ నిర్మాణశైలి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సా.శ..10-11వ శతాబ్దాలు

ఆలయ విశేషాలుసవరించు

ఈ ఆలయం తక్కువ ఎత్తులో గల వేదికపై నిర్మించబడింది. ఈ దేవాలయంలోని "లలతబింబ"లో నాలుగు హస్తాలు గల వినాయకుడు గజలక్ష్మీ ఉండే స్థానంలో ఉంటాడు. భువనేశ్వర్ లో గల వివిధ దేవాలయాల కంటే ఇది ప్రత్యేకతను సంతరించుకున్న విషయం. లలతబింబ గణేషుడు, సరస్వతీ దేవి యొక్క వివిధ విగ్రహాలను కలిగి ఉంది. దేవాలయం ముందు పార్వతి, కార్తికేయుడు యొక్క చిత్రాలున్నాయి. దేవాలయం యొక్క దక్షిణ భాగంలో ఆమ్లక రాయి ఉంది.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు