చతుర్వ్యూహములు

(చతుర్వ్యూహాలు నుండి దారిమార్పు చెందింది)

శ్రీ వైష్ణవ సిద్ధాంతము ప్రకారము భగవంతుడు నాలుగు వ్యూహములలో వ్యక్తమగును.

  • ప్రద్యుమ్న వ్యూహము
ఈ రూపము ఐశ్వర్య, వీర్య సంపన్నము. మనస్సునకు ప్రతీక.సృష్టి కార్యమును నిర్వర్తించును. ప్ర-ద్యుమ్న- అనగా అమితముగా వీర్యము గలవాడు.
  • అనిరుద్ధ వ్యూహము
ఈయన శక్తి, తేజస్సు గుణములు ప్రధానముగా గలవాడు. అహంకారమునకు ప్రతీక. స్థితి కార్యమును నెరపు సంరక్షకుడు. అ-నిరుద్ధ - అనగా ఆపజాలని వాడు. ఆయన రక్షణలో నున్నవారికి ఇంక భయము వలదు.
  • సంకర్షణ వ్యూహము
జ్ఙాన, బల గుణములు ప్రధాన లక్షణములుగా గలవాడు. జీవునకు ప్రతీక. లయ కార్యమును నిర్వహించువాడు. సమస్తమును ఆకర్షించి తనయందు లీనమొనర్చుకొనును.
  • వాసుదేవ వ్యూహము
పరమాత్ముడు. షడ్గుణ పరిపూర్ణుడు. అనగా జ్ఙానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు అను ఆరు గుణములు అవధులు లేకుండ కలిగినవాడు. సమస్తమునకు ఆధారము. సర్వత్ర వ్యాపించినవాడు. అనంత కాంతిమయుడు.

ప్రార్థన:

నమస్తే వాసుదేవాయ నమఃసంకర్షణాయచ
ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః