చదరంగ నియమాలు చదరంగం ఆటను నిర్దేశించే నిమయాలు. చదరంగం ఆట ఇద్దరు ఆటగాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేస్తే ప్రత్యర్థిని కట్టడి చేసే ఆట. ప్రతి ఆటగాడి ఆరు రకాలైన పదహారు పావులను కదుపుతూ ఉంటాడు. ఒక్కో రకమైన పావు ఒక్కో నిర్ధిష్టమైన పద్ధతిలో కదులుతుంది. ఈ ఆట ముఖ్య లక్ష్యం ప్రత్యర్థి రాజును కట్టడి చేయడం (చెక్ మేట్). రాజును కట్టడి చేయడం అంటే రాజును బంధించడానికి సిద్ధం చేసి, అది ఏ రకంగానూ కదలకుండా చూడటం. ఆట కేవలం రాజును కట్టడి చేయడమే కాకుండా వేరే రకాలుగా కూడా ముగియవచ్చు. ఉదాహరణకు ఆటగాడు మధ్యలో విరమించుకోవచ్చు. లేదా ఆట పలురకాలుగా డ్రా గా ముగియవచ్చు.

ప్రారంభ అమరిక

మార్చు
 
 
               
               
               
               
               
               
               
               
 
 
చదరంగం ఆట మొదలయ్యే ముందు పావుల అమరిక.

చదరంగం ఆటను చదరంగం బోర్డు మీద ఆడతారు. ఇది 64 చదరాలతో కూడిన 8 X 8 చతురస్రాకారంలో ఉంటుంది. నలుపు, తెలుపు గడులు ఒకదాని తర్వాత ఒకటి అమర్చబడి ఉంటాయి.[1] ప్రారంభంలో 16 తెల్ల పావులు, 16 నల్ల పావులు బోర్డు మీద అమరుస్తారు.

  • ఏనుగులు (రూక్స్) కుడి, ఎడమ మూలల్లో ఉంచబడతాయి.
  • గుర్రాలను (నైట్స్) అదే వరుసలో ఏనుగుల పక్కనే ఉంచబడతాయి.
  • శకటు లేదా ఒంటెలను (నైట్స్) అదే వరుసలో గుర్రాల పక్కనే ఉంచుతారు.
  • రాణి పావు అదే రంగు యొక్క మధ్య చతురస్రంలో ఉంచబడుతుంది: తెల్లని చతురస్రంపై తెలుపు రాణి, నలుపు చతురస్రంపై నలుపు రాణి ఉంటుంది
  • రాణి పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని రాజు తీసుకుంటాడు.
  • బంటులు మిగిలిన అన్ని పావుల ముందు ఒక్కో చతురస్రంలో ఉంచబడతాయి.
Piece King Queen Rook Bishop Knight Pawn
Number of pieces 1 1 2 2 2 8
Symbols  
 
 
 
 
 
 
 
 
 
 
 

ఆట నియమాలు

మార్చు

తెల్లపావులతో ఆడేవారు ఆట ప్రారంభిస్తారు. తర్వాత ఒకరి తర్వాత మరొకరికి ఎత్తు వేసే అవకాశం వస్తుంది. ఒక ఆటగాడి వంతు వచ్చినపుడు ఏదో ఒక ఎత్తు వేయాల్సిందే తప్ప (అది ఓటమికి దారి తీసేదైనా సరే) దాటవేయడానికి సాధ్యపడదు. రాజు కట్టుబడేదాకైనా, లేక ఆటగాడు మధ్యలోనే విరమించుకునే దాకైనా, లేక డ్రా గా నిర్ణయించబడేంత వరకయినా ఆట కొనసాగుతుంది. ఒకవేళ ఆట నిర్దేశిత సమయంలో కొనసాగుతుంటే ఇచ్చిన గడువులోపు ఎత్తు వేయలేకపోతే కూడా సదరు ఆటగాడు ఓడిపోయినట్లే పరిగణిస్తారు.

అధికారిక నియమాల ప్రకారం ఎవరు తెల్లపావులతో ఆడతారో చెప్పే నిబంధన లేదు. అందుకని ఇది టోర్నమెంటును బట్టి ఆధారపడి ఉంటుంది. ఆటగాళ్ళు ఒక అంగీకారానికి రావచ్చు, లేదా నాణేన్ని ఎగరేసి యాధృచ్చికంగా కూడా నిర్ణయించవచ్చు.

మూలాలు

మార్చు
  1. FIDE 2023, article 2.1.