చర్చ
చర్చ అనేది ఎంపికలో భాగంగా వ్యక్తి జ్ఞానాన్ని, మూర్తిమత్వాన్ని, నాయకత్వ లక్షణాల్ని అంచనా వేయడానికి వాడే ప్రక్రియ. దీనిని అభ్యర్థులను జట్టుగా చేసి, చర్చా శీర్షికని నిర్ణయించి, జట్టుని చర్చించమంటారు.చర్చ జరుగుతున్నప్పుడు, అభ్యర్థుల ప్రవర్తన, హావ భావాలని అంచనావేసి, జట్టు పనికి సరిపోయే వారిని తరువాత జరిగే ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
దీనిలో విజయానికి సూచనలు
మార్చు- ఇచ్చిన శీర్షిక గురించి సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకోవటం.
- చర్చలో అందరూ పాల్గొనేటట్లు సమయవిభజన చేసుకోవటం.
- ఇతరులు మాట్లాడుతున్నపుడు, మధ్యలో అనవసర జోక్యంచేసుకోకూడదు
- ఇతరుల విషయాలతో ఏకీభవిస్తున్నప్పుడు అది తెలియచేసి, మీకు ఇంకా కొన్ని విషయాలుంటే వాటిని తెలపటం.
- కోపం లాంటి, భావాలను అదుపులో వుంచుకోవటం.
- ప్రతిఒక్కరిని గౌరవించడం.
- మన చెప్పేదాన్ని ఆసక్తికరంగా చెప్పటం
- సమయపాలన
- చివరలో చర్చను క్లుప్తీకరించటం
వనరులు
మార్చుLook up చర్చ in Wiktionary, the free dictionary.