చర్చ:అమరావతి సంస్థానం

చరిత్ర కోణాలు

మార్చు

59.98.117.80 గారు,

మీరు వ్రాసిన వాక్యము తొలగించాను. రాజ్యములోని ప్రజలు చెంచుల మరియు పిండారీల ఆగడములు భరించలేక నాయుడుగారితో మొరపెట్టుకుంటారు. రాజా తన మంత్రియగు ములుగు పాపయారాధ్యులను మరియు పెద్దలను సంప్రదించి చెంచులను విందుకు పిలచి చంపిస్తాడు. ఆ కాలానికి, సమయానికి ప్రజాసంక్షేమునకై అలా చేయక తప్పలేదేమో! పశ్చాత్తాపమునకు మించిన పరిహారము లేదు కదా. వ్యాసములలో చరిత్రను ఉన్నదున్నటుల వ్రాయుటయే మన కర్తవ్యము. న్యాయాన్యాయములు చర్చకు సంబంధించిన విషయాలు.Kumarrao 06:39, 28 ఆగష్టు 2008 (UTC)

  • చెంచు నాయకుల చరిత్ర కూడా చదవండి.చెంచులను ఒక జాతిగా రాజ్యంగా ఎదగనీయకుండా వారి నాయకులను నిర్దాక్షిణ్యంగా దొంగలని పేరుపెట్టి చంపించిన దుర్మార్గునిగా వాసిరెడ్డి నాయుళ్ళను చెంచులు భావిస్తారు.ఎరుకల ఏకలవ్యుడు,సూత కర్ణుడు ఎలాంటి అన్యాయాలకు గురి అయ్యారో మనకు తెలుసుగదా?మీకు ఇష్టం లేని వారి చరిత్రను తొలగిస్తే ఎలా?వెలుగులోకిరాని చరిత్రను కనీసం తెలుసుకోండి,తెలుసుకోనివ్వండి
మీరు చెప్పేదానికి ఆధారం చూపండి. మీరు లాగిన్ తయారుచేసుకొని వ్రాస్తే బాగుంటుంది. δευ దేవా 08:21, 28 ఆగష్టు 2008 (UTC)
59.98.117.80 గారు,

మీరు వికీపీడీయా వ్యాసముల పద్ధతిని అపార్థము చేసుకున్నారు. వాసిరెడ్డి వారు చేసింది మంచా లేక చెడ్డా అనునది వ్యాసవిషయము కాదు. దీని గురించి మీ అభిప్రాయములు పుస్తక రూపములో గాని లేక వేరొక రూపములో ప్రజలకు తెలియచేయండి. లేదా చెంచునాయకుల చరిత్రపై వికీలో చారిత్రకాధారాలతో ఒక వ్యాసము వ్రాయండి. Kumarrao 11:02, 28 ఆగష్టు 2008 (UTC)

Return to "అమరావతి సంస్థానం" page.