చర్చ:అరటికాయ వేపుడు

మూడు నాలుగు సంవత్సరాలు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వంట చేసుకు తిన్న అనుభవంతో, అరటి వేపుడు తయారు చేయు విధానం వ్రాశాను.

కాని, ఇటువంటి వ్యాసాలు మొదలు పెట్టడంలో లక్ష్యం ఏమిటి?? కూరలన్నీ చేయటం వ్యాసాలుగా వ్రాద్దామనా! లేక ఎవరికి ఇష్టమయిన కూర గురించి వారు వ్రాద్దామనా. పాపం మొదలు పెట్టినవారు (పేరు లేదు) రెండు ముక్కలు వ్రాసి ఒదిలేశారు. ఇప్పుడొక నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటి వ్యాసాలు వ్రాద్దామనుకుంటే సామెతలకు వేసిన మంత్రమే వంటలకు కూడ తారక మంత్రం. వంటలన్నీ అక్షర క్రమంగా వ్రాస్తూ పోతే ఒక దశాబ్దానికో లేక రెండు దశాబ్దాలకో అన్ని వంటలూ పూర్తయ్యే అవకాశం కొంచెంగా కనపడుతున్నది. అన్నీ అక్షరక్రమంగా వ్రాయటంలో మరొక ఉపయోగమున్నది. ఏదన్నా వంటకం గాని కూర చెయ్యటం గురించి గాని తెలుసుకోగోరేవారు, వంటల పుటకు వస్తే సరిపోతుంది. సభ్యులు, అలోచించాలి మరి!--SIVA 20:35, 24 డిసెంబర్ 2008 (UTC)

Return to "అరటికాయ వేపుడు" page.