చర్చ:ఆంధ్రప్రదేశ్ అవతరణ
విశాలాంధ్రలో కలవాల్సిన యానాం
మార్చుకాకినాడకు 26 కి.మీ లలో 30చ.కి.మీ.విస్తీర్ణంగల యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.ఇప్పుడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.--Nrahamthulla 11:12, 12 అక్టోబర్ 2009 (UTC)
ఓయి తెలుగు వాడా
మార్చు- ఓయి తెలుగు వాడా
- పద అదే వెలుగు వాడ
- మన కలల పసిడి మేడ
- తగ దింటి నడుమ గోడ! ... ఓయి తెలుగువాడా...
- అన్నా కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కిలుకరేర్చి…..కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కిలుకరేర్చి…..
- సత్యాగ్రహ రణం చేసి, ఒక తండ్రిని ధారపోసి, దాయాదుల వెన్ను వంచి,
- సొంత గడ్డ సమార్జించి, తెలుగు జాతి పరువు పెంచి, సమైక్యతను నిర్వచించి -
- ఇప్పుడు రాష్ట్ర పటం చించి చించి….. ఏమున్నది, ఏమున్నది…ఏమున్నది, ఎమున్నదీ…??
- ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా
- ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా
- మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ ........ మనదే ...ఓయి తెలుగు వాడా!
- ఆంధ్ర, సీమ, తెలంగాణ ఒక్కొక్కొ టొక ఊడ
- ప్రతి ఊరూ, ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ
- పట్టిచ్చా వనుకో ఇపుడూవేరుపాటు చీడ
- ఇంకేమున్నది?ఏమున్నది?ఏమున్నది?ఏమున్నది?ఓయి తెలుగు వాడా!
- జాతి మహా యాత్ర ఇలా సాగే పోవాలి గాని
- నడుమన మన అడుగులు తడబడి పోతే
- నడకలలో వడి పోతే మనకు మనకు చెడి పోతే
- గొంతుకలన్నీ విడి పోతే కలయిక సందడి పోతే
- ఒక స్నేహపు ముడి పోతే ... చెడి పోతే ...
- ఏమున్నది?ఏమున్నది?ఏమున్నది?ఏమున్నది? ఓయి తెలుగు వాడా! --గజల్ శ్రీనివాస్ http://www.youtube.com/watch?v=Y38-I_tkXJ8