చర్చ:ఆదమ్ ప్రవక్త
అసంబద్ధ కథనాలు
మార్చు- హిందూ ధార్మిక గ్రంధాల ప్రకారం శంకరుడు మరియు పార్వతి ప్రథమ మరియు ఆది దంపతులు. - హిందువులూ ముస్లిములూ ఇరువురూ నమ్మవలసిన సత్యము ఏమంటే ఆదమ్ మరియు శంకరుడూ ఒకరే. పార్వతి మరియు హవ్వా ఒకరే. భూమిపై అందరికీ ఆది దంపతులు వీరే.
ఈ కథనం చాలా పొంతన లేకుండా ఉంది. హిందువుల నమ్మకం ప్రకారం శంకరుడు స్వయంభువు (ఇతన్ని ఎవరూ సృష్ఠించలేదు). ముస్లిముల నమ్మకం ప్రకారం ఆదమ్ స్వయంభువు కాదు. అతన్ని దేవుడు సృష్టించాడు. లా ఇలాహా ఇల్ అల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు) అని చెప్పే ఇస్లాం మతానికి, మూడు కోట్ల మంది దేవతలని నమ్మే హిందూ మతానికి పోలిక పెట్టడం చాలా హాస్యాస్పదం.
>>వీరి సంతతి అభివృధ్ధిచెందుతూ నేటికి 235 దేశాలలో 630 కోట్లకు చేరింది.<< ఔనా? వీరి సంతతి అభివృధ్ధిచెందుతూ నేటికి 235 దేశాలలో 630 కోట్లకు చేరింది అని ఇస్లామీయుల నమ్మకం అంటే అర్థం ఉంది కానీ, పై వాక్యానికి అర్థం లేదు.