చర్చ:ఆర్య వైశ్యులు

వైశ్య అసోసియేషన్(1905) వారు తమ పేరును కోమటి నుండి ఆర్యవైశ్య గా మార్చుకున్నారు. ఆర్య అంటే గొప్ప వంశస్థుడు అని అర్ధం. దీన్ని ఒక జాతికి సంబంధించిన పదంగా పరిగణించరాదు. వీరంతా ద్రావిడ సంతతికి చెందిన వారు. వీరిలో చాలామంది ద్రవిడ భాష అయిన తెలుగు మాట్లాడుతూ ద్రావిడ సంస్కృతిని పాటిస్తారు అని ప్రధాన వ్యాసం లో పేర్కొన్నారు.ద్రావిడ సంస్కృతిని పాటించే కోమట్లకు ఆర్యవైశ్యులు అనేపదం ఎలా సమంజసం? ద్రావిడ వైశ్యులు లేరుకదా?వైశ్యులు అంటే పోలేదా?--Nrahamthulla 04:23, 14 సెప్టెంబర్ 2008 (UTC)

జైనులు

మార్చు

తెలుగు నాట పూర్వ మరియు మధ్య యుగములలో బౌద్ధ, జైన మతములు ఉచ్చదశలో ఉండేవి. జైనులకు అనాడు కర్ణాట, ఆంధ్ర ప్రాంతములలో గోమఠుడు అరాధ్యుడు. గోమఠ పేరునుండి కోమటి పేరు పరిణామము చెందింది. ఆనాడు వాణిజ్య వృత్తిలో నున్న వైశ్యులకు కోమటులు అనే పెరు వచ్చింది. ఈ పేరు వేరు సామాజిక వర్గాలలొ కూడ వాడబడింది. ఉదా: కోమటి రెడ్డి, కోమటి నాయుడు. పెద కోమటి వేమారెడ్డి అందరికీ ఎరుకే. కాకతీయుల పూర్వులు, ధరణికోట రాజులు కూడ జైనులే. మధ్యయుగములో బ్రాహ్మణ/వైదిక మతాల ప్రభావము పెరిగింది. రాజుల ప్రోత్సాహము/బలవంతము కారణాలు (ప్రతాపరుద్రుడు జైనులను నూనె గానుగలలో వేయించి తిప్పించాడు. అతడు బందీ గా ఢిల్లీకి తీసుకు వెళ్ళబడుతున్నపుడు ఒక జైన కవి తగిన శాస్తి జరిగిందని వ్రాశాడు). కోమటులు ద్రావిడులు. ఉత్తర భారతములో వాణిజ్య వృత్తిలో నున్న లక్షలాది జైనులు ఇప్పటికీ గోమఠుని అరాధిస్తారు. కోమటులు ఆర్య వైశ్య అను పేరు తీసుకొనుట చారిత్రకముగా సమర్ధనీయము కాదేమో!

ఆర్యవైశ్యులు

మార్చు

వైశ్యులలో ఆర్యవైశ్యులు నూట ఒక్క గోత్రాలకు చెందిన వారు మాత్రమే ఆర్య వైశ్యులు. మిగిలిన వారిని బేరీ కోమటులు అంటారు. వారు ఊత్తర భారతదేశానికి చెందిన వారై ఉంటారు. సాధారణంగా సంప్రదాయంగా జరిగే వివాహాలు ఈ నూట ఒక్క గోత్రాలకు చెందిన వారిలో మాత్రమే చేస్తారు. ఆర్య వైశ్యులకు మాంస భక్షణ చేసే అలవాటు లేదు. వీరు పూర్తి శాకాహారులు. వివాహానికి పూర్వం ఉపనయనం తప్పని సరి. వీరికి కన్యకాపరమేశ్వరి కులదైవం. తమిళ నాట వాణిబ చెట్టియార్లు, నాట్టుకోట్టలి చెట్టి యార్లు, ఆయిరం వైశ్యులు అనే పలు రకాల చెట్టియార్లు ఉన్నారు. ఇంకా గాజుల శెట్లు అనే వాళ్ళు ఉన్నారు. వీరి సంప్రదాయాలు ఆర్యవైశ్యులకు బిన్నంగా ఉంటాయి. వీరు మాంస భక్షణ చేస్తారు. వీరికి ఉపనయనం ఉండదు. రాజ్య్శాంగచట్ట అనుసరించి వీరు ఫార్వర్డ్ కులాల జాబితాలోకి వస్తారు. మిగిలిన వారు బ్యాక్‍వర్డ్ కులాల జాబితాలోకి వస్తారు. సంపూర్ణంగా హిందూ సంప్రదాయాలబ్ను మాత్రమే అనుసరిస్తారు. వీరిలో విష్ణువును ఆరాధించే వారిని వైష్ణవులని, నిలువు బొట్టు వాళ్ళు అని , శివుని ఆరాధించే వారిని శైవులని, బొట్టు వాళ్ళు అని వ్యవహరిస్తారు. చక్రాంతాలు తీసుకోవడం అనే సాంప్రదాయం వీరిలోని వైష్ణవులకు ఉంది. వీరికి నూట ఒక్క గోత్రాలకు నూట ఒక్క వైష్ణవ గురువులు ఉంటారు. వారు శ్రీరంగంలో నివశించే బ్రాహ్మణులు. వారి వద్ద ఆర్య వైశ్యులు చక్రాంతాలు తీసుకుంటారు. సంప్ర్దాయకంగా అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి కనుకనే వీరు ఆర్యవైశ్యులుగా తమ పేరు నమోదు చేసుకోవడం సరి అయినదే అని నా అభిప్రాయం.--t.sujatha 16:41, 24 ఆగష్టు 2010 (UTC)

ఈ విషయాలు నాకు తెలియవు. మీరు చెప్పినది ఉచితముగా తోచుచున్నది.Kumarrao 17:09, 25 ఆగష్టు 2010 (UTC)
నా అభిప్రాయం పరిశీలించినందుకు ధన్యవాదాలు కుమర్రావు గారూ --t.sujatha 17:15, 25 ఆగష్టు 2010 (UTC)
Return to "ఆర్య వైశ్యులు" page.