చర్చ:కనుపర్రు
Untitled
మార్చుకనపర్రు గ్రామము నాదేండ్ల మండలం గుంటూరు జిల్లా లొ ఒక మేజర్ పంచాయితి.నరసరావుపేట, చిలకలూరిపేట దగ్గరిలొ వున్న పట్టణాలు (నరసరావుపేట-8కిమి, చిలకలూరిపేట-14కిమి). నరసరావుపేట, చిలకలూరిపేట రహదారి మధ్యలొ కనపర్రు బావి సెంటర్ దగ్గర దిగి రెండున్నర కిలొమీటర్ లు లొనికి వెళ్ళాలి. నరసరావుపేట నుండి ఆటొ సౌకర్యం వుంది. ఆర్ టిసి బస్సు సౌకర్యం లేదు. గుంటూరు-నరసరావుపేట రహదారి మద్యలొ సాతులూరు దగ్గర దిగి కూడా రావొచ్చు.2001 జనాభా లెక్కల ప్రకారం కనపర్రు గ్రామం లొ 960 ఇళ్ళు వున్నయి, 4102 మంది జనాభా(2038 మగ, 2064ఆడ) వున్నారు. వ్యవసాయం ప్రదానమైన వ్రుత్తి. వరి ముఖ్యమైనపంట. మిరప.ప్రత్తి,నూగులు,మినుములు,కందులు,సుబాబులు ఇతర ముఖ్యమైన వాణిజ్య పంటలు. నాగార్జునాసాగర్ రిజర్వాయర్ నుండి కాలువ ద్వారా నీటి సదుపాయం వుంది. వూరి పక్కగా సంవత్సరం పొడవునా కుప్పగంజి అనె వాగు ప్రవహిస్తు వుంటుంది. 50 యెకరల్లొ చేపల చెరువు వుంది. ఈ చెరువు నీటిని కూడా వ్యవసాయినికి వుపయొగించుకుంటూ వుంటారు. చెరువుని చేపలు పెంచుకొవడానికి కౌలు కి ఇస్తారు. ఈ కౌలు పంచాయితి కి కొంత అదాయం. గ్రామంలొ పాడి కూడా యెక్కువ.1000 వరకు పాడి గెదెలు వున్నయి. ఒక సహకార,4 ప్రైవేటు పాల సెకరణ కేంద్రాలు వున్నయి. కుమ్మరి, కమ్మరి మరియు ఇతర వ్రుత్తుల వారు కూడా వున్నరు. గ్రామంలొ ఊపాద్యాయ వ్రుత్తి లొ వున్న వారు యెక్కువ. గ్రామం లొని యువత యెక్కువగా హైదరాబాద్, మద్రాస్, బెంగళూరు, విజయవాడ ల్లొ వివిద వ్రుత్తుల్లొ స్తిర పడి వున్నారు. చదువుకున్న వారు గ్రామం లొ యెక్కువ మందె వున్నరు. ప్రబుత్వం నిర్వహించె వివిద కార్యక్రమాల ద్వార గ్రామం లొ అక్ష్యరాస్యత పెరిగింది.ఒక మండల్ పరిషత్ పాఠశాల, మిషనరి స్కూల్ (సెయింట్ చార్లెస్ హైస్కూల్ ) (తెలుగు మీడియం), ఒక అంగన్ వాడి కెంద్రం వున్నాయి. వూరికి దగ్గర్లొ ఒక ఇంగ్లిష్ మీడియం స్కూల్ కూడా వుంది. కళాశాల చదువుల కొసం యెక్కువగా నరసరావుపేట, చిలకలూరిపేట,గుంటూర్,విజయవాడ వెళ్తారు. వూరికి దగ్గర్లొ 4 ఇంజినీరింగ్, ఒక ఫార్మసి,ఒక డి.ఎడ్ కాలెజిలు వున్నయి. గ్రామం లొ హిందు,క్యాతొలిక్ మరియు ముస్లిం లు వున్నారు.వూరి కి సెంటర్ లొ హిందు దేవాలయాలు, చర్చ్, మసిద్ పక్క పక్కనె వున్నాయి. గ్రామం లొ వున్న చర్చ్ 1887 లొ నిర్మించారు. క్యాతొలిక్కుల జనాబా కాస్త యెక్కువగ వుంటుంది. ఆంద్రా లొ వున్న చాలా తక్కువ క్యాథొలిక్ గ్రామల్లొ యిది ఒకటి. ఈ వూరికి దగ్గర్లొ వున్న కనపర్రు బావి సెంటర్ లొని చర్చ్ చుట్టు పక్కల బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. సంక్రాంతి, వుగాది, దసరా,దీపావళి,రంజన్, క్రిస్మస్ లు ముఖ్యమైన పండుగలు. వీటి తొ పాటు గా ప్రతి జనవరి 23, 24 తారీఖుల్లొ వూరి తిరునాళ్ళ జరుగుతుంది. నియొజకవర్గ రాజకీయ్యాల్లొ వూరికి ముక్యభుమిక వుంది. రాజకీయ కక్ష్యలు, వాటి పర్యావాసానాలైన గొడవలు యెక్కువగ వుండెవి. కనపర్రు చిలకలూరిపెట శాసనసభ నియొజకవర్గం పరిది లొ వుంది. పత్తిపాటి పుల్లారావు ప్రస్తుత నియొజకవర్గ ప్రజా ప్రతినిది. గ్రామానికున్న ప్రదానమైన సమస్యలు సురక్షితమైన మంచి నీటి వసతి లెకపొవడం, మురుగు కాలువలు, కుప్పగంజి వాగు మీద వంతెన లెకపొవడం కెసనుపల్లి మీదుగా తారు రొడ్డు సౌకర్యం లాంటి కొన్ని ఇతర సమస్యలు కూడా వున్నయ్. గమ్యం సినిమా లొ చూపించిన అనాదాశ్రమమము,అందులొ గిరిబాబు వెసిన పాత్ర కి మూలం అయిన అనాదాశ్రమమము యి వూరిలొనె వుంది. దాని పేరు నైస్(నీడి ఇల్లిటెరెట్ చిల్ద్రెన్ ఎడ్యుకెషన్).