చర్చ:క్రీస్తు తెలియని సంవత్సరాలు
క్రీస్తు india రాలేదు సుమారు 1995లో “కలియుగ కాల జ్ఞానము” అనే పుస్తకాన్ని డా వేదవ్యాస్ వ్రాయటము and అందులో 1999 లో యుగాంతము వస్తుందని,విశ్వము నాశనము అవుతుందని అని ప్రస్తావిస్తూ అలానే bibleకు భిన్నమైన యేసుక్రీస్తు విషయాన్నీ ప్రస్తావించడము జరిగింది అదే jesus ఇండియాకి వచ్చాడని..jesus indiaకు వచ్చాడని అనుటకు bibleలో ఉన్న కొని సందర్భాలను ,మాటలను ఆధారముగా చేసుకుని మాట్లాడడము జరిగింది. bible తెలియని వ్యక్తిగా ఉన్న వేదవ్యాస్ bible గురించి తెలియక మాట్లాడడము పొరపాటు. 1) వేదవ్యాస్ bibleలో ఏ విషయాన్నీ బట్టి యేసుక్రీస్తు indiaకి వచ్చాడని ప్రస్తావించాడో మనము తెలుసుకోవాలి. క్రైస్తవుడిగా మన బాధ్యతలు తెలుసుకొనవలసిన అవసరత ఎంతగానో ఉన్నది.ఏంటి మన బాధ్యత అని వాక్యపు వెలుగులో చూస్తే (a)1 పేతురు 3:15,16-మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోను ,భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్దముగా ఉండి.....(b)1తిమోతి2:4-మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును(సత్యము అనగా వాక్యము john17:17) గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు.. (c) 11పేతురు 3:18- జ్ఞానముయందు అభివృద్ధి పొందుడి.(d) 1పేతురు 2:15- అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు ముయించుట దేవుని చిత్తము.(e)phillipu 1:7-నేను సువార్త పక్షమున వాదించుటయందును..... అంటే క్రైస్తవుడిగా మన పని bible నేర్చుకుని ,నేర్చుకున్న bibleలోని మాటలకు ఎవరైనా భిన్నముగా మాట్లాడితే,ప్రశ్నిస్తే వారికీ సమాధానము చెప్పే భాద్యత మనకు ఉన్నది. 2) పై మాటల బట్టి క్రైస్తవులకు కేవలము పాటలు,ప్రార్ధనలు సరిపోవని క్రైస్తవుని బాధ్యత ప్రశ్నిస్తున్న వాడికి జవాబు చెప్పాలని,మూర్ఖముగా మాటలడుతున్న వాడి నోరు ముయించాలి. 3) అస్సలు యేసుక్రీస్తు indiaకు రాలేదని క్రైస్తవులుగా ఎలా నిరుపించగలము??indiaకు వచ్చాడను మాట ఎంతవరకు నిజము?? indiaలో కాశ్మీర్ కీ వచ్చి అక్కడ బౌద్ద సన్యాసుల దగ్గర బౌద్ద విద్యలు నేర్చుకున్న తర్వాత israelకి వెళ్ళిపోయి ,సిలువ వేసే సమయములో సిలువ నుంచి తప్పించుకుని పారిపోయి మరల ఇండియాకి వచ్చి ,ఇక్కడే marriage చేసుకుని పిల్లలను కానీ చనిపోయాడట. ఇలా వేదవ్యాస్ తన పుస్తకములో యేసుక్రీస్తు గురించి వ్రాసాడు. 4) ఎప్పుడు వచ్చాడు indiaకు అని అడిగితే 12వఏట వచ్చి israelకి 30వ ఏట వెళ్ళాడట.సరిగ్గా 12వ ఏటనే అని ఎందుకు వేదవ్యాసు అంటున్నాడో ఆలోచిస్తే bibleలో యేసుక్రీస్తు 12వ ఏట ఎరుశాలేములో కనిపించినట్లుగా and 30వ ఏట యేసుక్రీస్తు బాప్తీస్మం తీసుకున్నట్లుగా మరియు ఈ మధ్యకాలములో అయన ఏమైపోయాడో అన్న విషయము లేకపోవటము వలన ఈ మధ్యకాలములో వేదవ్యాస్ ఈ కధను అల్లాడు. 5) క్రైస్తవులకు bibleలో తెలియనిది- యేసుక్రీస్తు 12 వ ఏట కనపడుతున్నాడు ,మరలా 30 వ ఏట కనిపించాడు and ఈ మధ్యకాలములో ఏమైపోయాడో తెలియక వచ్చి ఉండొచ్చుఏమో అని అనుకుంటున్నారు. luke 2:42-అయన పన్నెండుయేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగను నాచరించుటకు వాడుక చొప్పున ఎరుశాలేముకు వెళ్ళిరి.ఇక్కడ 12 వ ఎటు ఎరుశాలేమునకు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాము. 12 నుంచి 30 వరకు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడన్న విషయాలు లేవు అని వేదవ్యాసు యేసు జీవితానికి మచ్చ తెచ్చే కధను అల్లాడు అదే ఇండియాకి రావడము. luke 3:23- యేసు భోదింప మొదలుపెట్టినప్పుడు అయన దాదాపు 30 యేండ్ల యిడు గలవాడు.... ఈ 18 years మధ్యలో బౌద్ద సన్యాసుల దగ్గర విద్యను నేర్చుకుని మరలా israelకి వెళ్లి ప్రజలందరికీ భోదింపజేసాడని వేదవ్యాసు అన్నాడు. 6) అస్సలు యేసుకి బౌద్ద సన్యాసుల దగ్గరకు వచ్చి బౌద్ద విద్యలు నేర్చుకోవాల్సిన అవసరత ఏమి వచ్చింది?? 12 వ ఏటనే శాస్త్రులకు ,పరిసయ్యులకు,ప్రధాన యాజకులకు చెమటలు పట్టించాడు యేసుక్రీస్తు ఎరుశాలేములో.నోటి మాట రాకుండా చేసాడు తన జ్ఞనముతో. luke 2:47-అయన(యేసు) మాటలు వినిన వారందరు అయన ప్రజ్ఞాకును,ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి.. ఇంత జ్ఞన సంపుర్ణుడిగా ,పరిపుర్ణుడిగా 12 వ ఏట ఉన్న యేసు ఈ బౌద్ద సన్యాసుల దగ్గరకు వచ్చి నేర్చుకొనవలసిన అవసరత ఏమి ఉన్నది?? ప్రజ్ఞ అంటే వయస్సుకు మించిన జ్ఞానము గలవారిని అర్థము.ఇక్కడ యేసుకు 12 years అయినప్పటికీ చెప్పుతున్న జ్ఞానము చాల గొప్పది. 7) యేసు పుట్టింది israel వంశములో,యుదా గోత్రములో. israel వంశములో యుదా గోత్రములో పుట్టినందుకు అప్పటికి వారికున్న ధర్మశాస్త్రమును పాటించాలి.ఆ ధర్మశాస్త్రములో ప్రతి కుటుంబములో పురుషుడు అయిన ప్రతి ఒక్కడు year కి మూడు మార్లు ఎరుషలేము దేవాలయములో కనిపించాలి.ఒకవేళ 12 వ ఏట indiaకి వెళ్లి 30 వ ఏట వస్తే ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావని యేసును నిలదిసేవారు ప్రధాన యాజకులు. ఎందుకంటే ప్రధాన యాజకులు యేసుపై అవకాశము ఎప్పుడు దొరుకుతుందా నిందమోపడానికి అని ఎదురుచూచేవారు. 8) luke2:51-అంతట అయన(యేసు) వారితో(మరియ,యేసేపు)కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికీ(మరియ,యేసేపు) లోబడియుండెను. అనగా యేసు 12 వ ఏట మరియ ,యేసేపుతో నజరేతుకు వచ్చాడని ,నజరేతుకు వచ్చిన అయన తన తల్లితండ్రులకు లోబడినట్లుగా ఉన్నదే తప్ప అయన అక్కడ నుంచి ఇండియాకు వచ్చాడని కానీ,జపానుకు వెళ్ళాడని కానీ, russia కు వెళ్ళాడని కానీ ఇవి ఏమి bible లో లేవు. luke2:52-యేసు జ్ఞానమందును,వయస్సునందును వర్దిల్లుచుండెను............ అనగా ఈ వచనములో 12వ ఏట నజరేతుకు వచ్చిన యేసు అక్కడ వయస్సులో వర్దిల్లుఅయ్యాడని అర్థమవుచున్నది. అనగా 12,13,14...28,29,30 ఇలా వయస్సులో నజరేతులో ఉండి ఎదిగాడే తప్ప 12 వ ఏట అక్కడ నుండి ఎడ్ల బండి మీద ఇండియాకు వచ్చి బౌద్ద సన్యాసి దగ్గర విద్యలు నేర్చుకోలేదు. 9) యేసు 12-30 వరకు నజరేతులో ఉన్నట్లు వాక్యము ద్వార తెలుసుకున్నాము.luke 4:16-తను పెరిగిన నజరేతు.......... ఈ వచనములో నజరేతులో పెరిగినట్లుగా తెలుస్తుంది. అయన పెరిగింది,ఉన్నది నజరేతులో and అయన వయస్సులో ఎదిగింది నజరేతులో. కనుక నజరేతులో ఉన్నాడే తప్ప నజరేతును విడిచిపెట్టి వచ్చినట్లుగా వాక్యములో లేదు.అ౦దుకే నజరేయుడైన యేసుగా పిలవబడుతున్నట్లుగా bible లో మనము చూస్తున్నాము. john 19:19- మరియు పిలాతు –యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. ఆకరికి రోమా గవర్నర్ అయిన పిలాతే నజరేయుడగు యేసు అని అంటున్నాడు . యేసు నజరేతుకు చెందినా వాడను roma governer అంటుంటే మధ్యలో ఈ వేదవ్యాసు చెప్పిన మాటలు ఎలా నిజాము అవుతాయి??? 10) కనుక యేసు ఇండియాకు వచ్చాడు అని అనుటకు ఎటువంటి అధరాలు bible లో లేవు. పుట్టింది బెత్లెహేములో,పెరిగింది నజరేతులో ,వాక్యము ప్రకటించింది ఆ ఎరుషలేము పరిసర ప్రాంతాలలో,అక్కడే మరణించి,సమాధి చేయబడి,అక్కడే తిరిగి లేచాడు. అక్కడ నుంచే పరలోకము వెళ్ళినట్లుగా మనము వాక్యములో చూస్తున్నాము.
క్రీస్తు తెలియని సంవత్సరాలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. క్రీస్తు తెలియని సంవత్సరాలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.