చర్చ:చంద్రుడు

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Ahmadnisar
చంద్రుడు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 46 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


చంద్రుడి గురించి వ్రాసేటపుడు, చంద్రుడి విశేషాలు వర్ణించేందుకు కొన్ని పదజాలాలు అవసరమయ్యాయి, అవి తెలుగు పుస్తకాలలో నేను గమనించలేదు. వాటి కొరకు కొన్ని తెలుగు పదాలు సృష్టించాను, సభ్యులకు అవి సబబుగా అనిపిస్తే ఉపయోగించండి, లేదా దయవుంచి ప్రత్యామ్నాయాలను సూచించి తోడ్పడండి.
  • చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి "చంద్ర భ్రమణం" (ఇది క్రొత్త పదం, సృష్టించబడినది)
  • చంద్రుడు భూమిని ఒక్కసారి చుట్టిరావడానికి "చంద్ర భూ పరిభ్రమణం" (ఇది క్రొత్త పదం, సృష్టించబడినది)
  • చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి (చంద్రభ్రమణం) మరియు భూమి చుట్టూ తిరగడానికి (చంద్ర భూ పరిభ్రమణం) ఒకే సమయం (చంద్రమాసము) పడుతుంది.
  • చంద్రుడు భూమితో కలసి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి "చంద్ర భూ సూర్య పరిభ్రమణం" (ఇది క్రొత్త పదం, సృష్టించబడినది) భూపరిభ్రమణానికి పట్టే కాలంతో సమానం. సభ్యుడు నిసార్ అహ్మద్ 12:47, 16 మే 2008 (UTC)Reply
Return to "చంద్రుడు" page.