చర్చ:తంగెడుపల్లె (వీరపునాయునిపల్లె)

తంగెడుపల్లె , వీరపునాయునిపల్లె మండలం లో అందమైన వూరు. అతి దగ్గర టౌన్: వేంపల్లి కడప జిల్లా లోని ముఖ్యమైన పట్టణాల నుండి బస్ మార్గము లో దూరము: కడప నుండి : 41 కిమీ ప్రొద్దుటూరు నుండి: 42 కిమీ రాయచోటి నుండి : 56 కిమీ పులివెందుల నుండి : 40 కిమీ .

చుట్టూ కొండలు , పక్కనే పాపాగ్ని నది పచ్చని పొలాలు చాలా అందంగా ఉంటుంది. రాయలసీమ లో ఉన్న టిపికల్ గ్రామాల్లో ఇది ఒకటి.1985 ముందు కడప జిల్లా లోని ఫాక్షన్ కి పేరుమోసిన గ్రామాల్లో ఇది ఒకటి, కానీ ఇప్పుడు ఒక ఆదర్శ గ్రామం. చక్కటి నీటి వసతి, అన్ని పట్టణాలని కలుపుతూ రోడ్ మార్గం వీటన్నిటికీ తోడు మంచి మనసున్న మనుషులు ఈ వూరి ప్రత్యేకతలు.ముఖ్యమైన జీవనొపాది వ్యవసాయం. వేరుశనగ( ground nut), ప్రత్తి (cotton), ప్రొద్దు తిరుగుడు (sun flower), కంది( dal) ముఖ్యమైన పంటలు.

రెండే పాత్రలతో 'షో' సినిమా తో ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత గా జాతీయ పురస్కారం అందుకొన్న దర్శకుడు 'నీలక౦ఠ' ఈ వూరి వాడే.

google map link : http://maps.google.com/maps/ms?ie=UTF8&hl=en&msa=0&msid=114052006451772703677.00044a112a864f8c2c6d0&ll=14.391406,78.480121&spn=0.002541,0.004678&t=h&z=18

--page సృష్టించినది : పెద్దిరెడ్డి రామ్ మోహన్ రెడ్డి

Return to "తంగెడుపల్లె (వీరపునాయునిపల్లె)" page.