చర్చ:దర్దెపల్లి

—13:46, 9 జూన్ 2009 (UTC)venna దర్దెపల్లి

    దర్దెపల్లి, పాలకుర్తి మండలంలో ముఖ్య గ్రామము. ఇది మండలానికి 3కి.మి దూరంలో ఉంది.పాలకుర్తి నండి తొర్రూర్(మం) వెల్లే మార్గంలో మొదటి ఊరు. దండెమ్మఈ ఊరి గ్రామ దేవత. అందువల్ల ఊరిని దండిదేవరపల్లి అని పిలిఛేవారు. కాల క్రమంలో ఈ ఊరిని దర్దెపల్లి పిలిస్తున్నారు. ఈ ఊరిలో ప్రజలందరు సామరస్యంగా ఉంటారు. గ్రామ జనాబ దాదాపు 15,000. ఈ ఊరిలో మరో పుణ్యక్షేత్రం శివాలయం.ఇది ఊరి మధ్యలో ఉంది. అందులోనే సంతోషిమాత,ఆంజనేయస్వామి,గణపతి దేవాలయాలున్నవి.కాని నవగ్రహాలను ఇంకా ప్రతిష్టింఛాల్సిఉంది.
    ఈ గ్రామంలో ఒక ప్రభుత్వ పాాశాల (శిశు నండి 8 వరకు)ఉంది. ఒక ప్రైవేటు పాటశాల(శిశు-10వరకు)ఉంది.ఈ రెండూ కూడా తెలుగు మీడియం పాటశాలలే.
    బోనాల పండుగ చాలా బాగా జరుగుతుంది. ఎవరైన మొక్కు ఉన్నవారు దెవతకు ఎడ్ల బండిమీద ఛీరెను నేయిస్తారు. తర్వాత అ చీరెను దెవతకు అలంకరిస్తారు. ఉదయమే ప్రజలు దేవతకు కోళ్ళు హారం(బలి )ఇస్తారు. బోనాలు చేయని వారు దేవతకు పడి(నేవేద్యం)సమర్పిస్తారు. మద్యహ్నం నుండి సాయంత్రం వరకు దండెమ్మ గుడి చుట్టు ఎడ్ల బండ్లు తిరుగుతాయి. ఊరు అంతా ఒకేరోజు ఒకేసారి బోనాలు చేస్తారు. సాయంత్రం అందరు కలిసి బోనాలను ఊరేగింపుగా గుడి దగ్గరకు తీసుకువస్తారు. ఆ దృశ్యం చాలా అందంగా ఉంటుంది. చుట్టు ప్రక్కల గామ ప్రజలు కూడా ఈ ఉత్సవాన్ని కనులారా తిలకించడానికి గ్రామనికి తరలి వస్తారు. ఆ రోజు ఊరంతా ఎంతో సందడిగా ఉంటుంది.
    సాయత్రం బోనాలను గుడి ఛుట్టు వరుసగా పేర్చి దేవతకు మొక్కులను తీర్చుకుంటారు.తర్వాత బైండ్లొల్లు దండెమ్మ కథ ఛెపుతారు.ఈ

విదంగా రాత్రి మొత్తం మొక్కులను తీర్చుకుంటారు.ఈ కార్యక్రమం దాదాపు ఉదయం 4 గం, వరకు జరుగుతుంది.తర్వాత వారివారి బోనాలను తీసుకొని వెలతారు.ఈ విదంగా బోనాల పండగను జరుపుకుంటారు.

                                                      ```` వి.భాస్కర్
Return to "దర్దెపల్లి" page.