చర్చ:నాగోబా జాతర

నాగోబా జాతర నేపథ్యంలో ప్రత్యేక కథనం..

ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా దేవాలయంలో ప్రతియేటా పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి జాతర ప్రారంభమవుతుంది. జిల్లాలోని గిరిజనులతోపాటు వరంగ ల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల వారే కా కుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్టల్ర నుంచి తరలివస్తారు. గంగాజలం కోసం కా లినడకన వెళ్లిన మెస్రం వంశీయులు శనివారం ఇంద్రవెల్లికి చేరుకుని ఇంద్రాయి వద్ద పూజలు నిర్వహించడంతో సంబరాలు ఆరంభమయ్యా యి. అదే రోజు కేస్లాపూర్ చేరుకుని నాగోబా ఆల య సమీపంలోని మర్రిచెట్ల(వడమర) వద్ద విడిది చేస్తున్నారు. ఈ నెల రెండున ప్రారంభమ య్యే జాతర 13న ముగుస్తుంది. వివిధ ప్రాంతా ల గిరిజనులు జాతరకు తరలి వస్తున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

పూజలు ఇలా... జాతర ప్రారంభానికి ముందు మెస్రం వంశీయు లు జన్నారం మండలం కలమడుగు గోదావరి రేవులోని అస్తలమడుగు(అత్తలమడుగు) నుంచి కాలినడకన గంగాజలం తీసుకొస్తారు. ఇంద్రవెల్లిలోని ఇంద్రాయిదేవికి ప్రత్యేక పూజల అనంతరం కేస్లాపూర్ చేరుకుంటారు. నాగోబా ఆలయానికి సమీపంలో ఉన్న మర్రిచెట్ల(వడమర) వద్ద విడిది చేస్తారు. ఆ సమయంలో గంగాజలం ఉన్న కల శం కింద పెట్టకుండా చెట్టు కొమ్మకు కట్టి ఉంచుతారు. పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు. ఆల యంలో ఏడు పుట్టలు తయారు చేసి నవధాన్యాలు, ఆవుపాలు, నైవేద్యంగా సమర్పిస్తారు.

సిరికొండ నుంచి కుండలు.. ఇచ్చోడ మండలం సిరికొండలో ప్రత్యేకంగా త యారు చేసిన 116 మట్టికుండలను పూజల కో సం తీసుకొస్తారు. పూజల అనంతరం మెస్రం ఆ డపడుచులు వడమర సమీపంలోని బావి నుంచి వాటిలో నీటిని ఆలయానికి తెస్తారు. గత ఏడాది నిర్మించిన మట్టిపుట్టలను తొలగించి వాటి స్థానం లో ఆవుపేడ, జలంతో మట్టి పుట్టలు నిర్మించి కొలుస్తారు. అనంతరం కిక్రీ, డోలు తదితర వాయిద్యాలతో పెద్దలు కచేరీలు నిర్వహిస్తారు.

మెస్రం వంశీయులే కటోడాలు.. మెస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మెస్రం వంశీ యుల కిందికి వస్తారు. మడావి, మర్సుకొల, పు ర్క, మెస్రం, వెడ్మ, పంద్రా, ఉర్వేత ఇంటిపేర్లు గ లవారు మెస్రం వంశీయులు. వీరే కటోడా(పూజారులు)లుగా వ్యవహరిస్తారు. పూజారులను మూ డేళ్లకోసారి మార్చడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వారు కొత్వాల్, మెస్రం వంశంలో 22 తెగల వారిని పేరు పేరున స్మరించుకుంటారు.

గోవడ నుంచి పూజలు నాగోబాకు పూజలు నిర్వహించే మెస్రం వంశీ యులు ఆలయం వద్ద ఉన్న గోవడ(గుండ్రంగా గోడ కట్టి ఉండే ప్రాంతం)లోనే విడిది చేస్తారు. ఈ గోవడలో 22 కిత్తలతో విడిది చేసి నాగోబా జాతర ముగిసే వరకు పూజలు నిర్వహిస్తారు.

జాతరలో బేటింగ్... మెస్రం వంశంలో పెళ్లిళ్లు జరగ్గానే ఇంటికి వచ్చే కోడళ్లను వెంటనే వంశస్తురాలుగా గుర్తించరు. నాగోబా సమక్షంలో బేటింగ్ నిర్వహించాకే వారి వంశపు కోడళ్లుగా గుర్తింపు ఇస్తారు. ఇందుకోసం ప్రతి ఏడాది నాగోబా పూజల అనంతరం ఆలయంలో బేటి(బేటింగ్) నిర్వహిస్తారు. ఆలయంలో తయారు చేసిన పుట్ట వద్ద నూతన దంపతులతో ప్రత్యేక పూజలు జరిపిస్తారు. నాగోబా దర్శనం అనంతరం మెస్రం వంశంలోని కుల పెద్ద భార్య కోడళ్లను వంశస్తులకు పరిచయం(బేటి) చేయిస్తారు. అప్పటి నుంచి వారిని మెస్రం వంశం కోడళ్లుగా గుర్తిస్తారు.

నాగోబా చరిత్ర పూర్వకాలంలో మెస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పరూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్ప రూపంలోని నాగేంద్రుడికి తల్లి తన తమ్ముడి కూతురైన గౌరితో వివాహం జరిపిస్తుంది. అత్త ఆజ్ఞ మేరకు గౌరి తన భర్త నాగేం ద్రున్ని బుట్టలో పెట్టుకొని గోదావరికి వెళ్తుంది. సర్పం ఓ చోట ఉడుం రూపంలో కనిపించడంతో అక్కడ ఉడుంపూర్ ఏర్పడింది.

ఆ తర్వాత గౌరి గోదావరి నదిలో స్నానానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారడాని.. అయితే పేరు ప్రతిష్టలు కావాలో సంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్క చేయకపోవడంతో తిరిగి నాగేంద్రుడు పాము రూపంలోకి మారడానే కథ ప్రచారంలో ఉంది. నాగేంద్రుడి కోసం ఉడుంపూర్ నుంచి గరిమ్మెల వరకు వెతికిన గౌరి గోదావరిలోని సత్యవతి గుండంలో కలిసిపోయిందని, ఆమె వెంట నాగేంద్రుడు ఉంచిన ఎద్దు రాయిగా మారిందని పెద్దలు చెబుతుంటారు. ఆ తరువాత పెళ్లి అయిన ప్రతి జంటకు నాగేంద్రుని సన్నిధిలో పరిచయం(బేటి) చేయాలని చెప్పి నాగేంద్రుడు కేస్లాపూర్ గుట్టలోకి వెళ్లిపోవడంతో అక్కడ నాగోబా వెలిసిందని ప్రచారంలో ఉంది.

నూతన విగ్రహాల ప్రతిష్ఠాపన ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : ఈ నెల రెండు నుంచి జరిగే కెస్లాపూర్ నాగోబా జాతరలో నూతన విగ్రహాలు ప్రతిష్టించనున్నారు. సుమారు 25 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన నాగోబా విగ్రహ స్థానంలోనే ఈ విగ్రహం ఏర్పాటు చేయనున్నామని దేవస్థానం పటేల్ వెంకట్రావ్ తెలిపారు. పురాతన విగ్రహానికి మరమ్మతులు రావడంతో 40 కేజీల ఇత్తడితో నూతన విగ్రహం రూపొదించామని పేర్కొన్నారు. తయారీకి రూ.60వేలు ఖర్చయిందని వివరించారు.

సీసీ కెమెరాలతో నిఘా... ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : నాగోబా జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ వీరమల్లు తెలిపారు. దర్బార్‌లో, ఆలయంలో, ఆటస్థలంలో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కేస్లాపూర్‌లో నాగోబా జాతర నిర్వహణ దృష్ట్యా ఏయే శాఖల అధికారులు ఎలాంటి విధులు నిర్వర్తించాలనే విషయమై అధికారులతో సమీక్షించారు. నాగోబా జాతరకు రాష్ట్ర స్థాయిలో మరింత పేరు తేవడానికి ఐటీడీఏ కృషి చేస్తోందని చెప్పారు.

నాగోబా జాతర గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "నాగోబా జాతర" page.