చర్చ:నీళ్ళలో వెల్డింగు
water welding
మార్చుహైపరుబారిక్ వెల్డింగు: హైపరు బారిక్ (hyperbaric) పద్ధతిలో వెల్డింగు చేయు ప్రాంతంలో తాత్కాలికంగా ఒక అర/గది వంటిది ఏర్పాటు చేసి, అందులోని నీటిని తొలగించి అతుకు ప్రక్రియ. ఈ వెల్డింగు పద్ధతిలో అతుకులు పొడి వాతావ రణంలో చెయ్యడం వలన తడి వెల్డింగు కన్న నాణ్యతగా వుండును. వెల్డింగు కూడా నిలకడగా చెయ్యవచ్చును.అతుకు నెమ్మదిగా చల్లబడుట వలన అతుకువద్ద లోహాం పెళుసుగా మారదు. ముందు వెల్డింగు చెయ్యవలసిన ప్రాంతం/ప్రదేశం చుట్టూ తాత్కాలికంగా ఒక గదివంటిది నిర్మిస్తారు.ఇప్పుడు గదిలో వెల్డింగు చెయ్యు నిపుణుడు తగిన రక్షిత ఏర్పట్లతో, పరికరాలతో గదిలో ప్రవేశించి, గదిని మూసివేసి.గదిలో వత్తిడితో గాలి లేదా ఆక్సిజను, హీలియం వంటి వాయువులను గదిలో ప్రవేశపెట్టి గదిలోని/అరలోని నీటిని బయటకు వెళ్ళేలా చేయుదురు. గది/అర లోని వత్తిడి గదిబయటవున్న నీటి వత్తిడి ఎక్కువ వున్నంతవరకు నీరు గదిలో ప్రవేశించలేదు. ఈ వెల్డింగు విధానం తడి వెల్డింగు కన్న ఎంతో మెరుగైన వెల్డింగు విధానం అయ్యినప్పటికి, అన్నిచోట్ల ఈ విధానంలో వెల్డింగు చెయ్యుటకు వీలుకాదు. అరను నిర్మించుటకు వీలులేని ఇరుకైన ప్రదేశాలలో వెల్డింగు చెయ్యలేరు. అటువంటి చోట్లలలో తడి వెల్డింగు చెయ్యుదురు.15 మీటర్ల లోటుకు మించి వెల్డింగు చెయ్యవలసినచో, గదిలో మూడు కేజిలకు మించి వత్తిడిని గదిలో ఏర్పరచ వలసిన సందర్భంలో గదిలో గాలిని నింపడం శ్రేయస్కరంకాదు, అంత వత్తిడి వద్ద గాలి లోని ఆక్సిజను, నైట్రోజనులు దుష్ఫలితాలు కల్గిస్తాయి. అటువంటి సందర్భాలలో హీలియం+ఆక్సిజను లాదా ఆర్గాన్+ఆక్సిజను వాయు మిశ్రాలను ఉపయోగించాలి 2401:4900:367C:574D:2D14:B76E:1B12:5302 13:35, 1 జూన్ 2021 (UTC)