చర్చ:పాఠశాల

Add discussion
Active discussions

ప్రైవేట్‌ పాఠశాలలుసవరించు

విద్యారంగంలో సేవలందించడానికే వస్తున్నాం... అనుమతి ఇవ్వండి' అంటూ ఆ సంస్థలు పాఠశాలల యాజమాన్యాలు బడులు పెట్టే సమయంలో ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తా యి.ఇలా పర్మిషన్‌ తీసుకున్న ప్రైవేట్‌ బడుల్లో చదివే ప్రతి వంద మంది విద్యార్థుల్లో పట్టుమని పది మందికైనా వారు ఉచితంగా చదువు చెప్పిన దాఖలాలు ఉండవు.ప్రైవేట్‌ పాఠశాలలు ఫీజుల పేరిట తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నాయి.పిల్లలను చదివించాలంటే ప్రస్తుతం ఇళ్లు, భూములు తాకట్టు పెట్టుకోవాల్సి న పరిస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. నేషనల్‌, ఇంటర్నేషనల్‌, ఒలింపియాడ్‌, కాన్సెప్ట్‌, ఈ-టెక్నో, ఈ-శస్త్ర పేరుతో పాఠశాలలు పుట్టాయి. లాభసాటి వ్యాపారం కావడంతో బిల్డర్లు, రాజకీయనేతలు వీటినే కేంద్రాలుగా మార్చుకున్నారు.ఏటా వేల కోట్ల టర్నోవర్‌ నడుస్తుంది.సత్యం రామలింగ రాజు కూడా ఓ పాఠశాల పెట్టారంటే పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు.ప్రతి పాఠశాలకు పుట్టగొడుగుల్లా శాఖలు పుట్టుకొస్తాయి. కొత్త శాఖలు పెట్టుకోవడానికి ప్రజలను యాజమాన్యాలు జలగల్లా పీల్చుతాయి.జీవో నెం.91 ప్రకారం వచ్చే ఏడాది వసూలు చేయనున్న ఫీజులపై ఆయా పాఠశాలలు ప్రతిపాదనలు పంపించాలి. 99 శాతం పాఠశాలల నుంచి ప్రతిపాదనలే అందలేదు. దీని ప్రకారం నడుచుకోకపో తే ఆయా పాఠశాలల గుర్తింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.ఐఐటీ ఒలింపియాడ్‌, కాన్సెప్ట్‌, ఈ-టెక్నో, ఈ-శస్త్ర వంటి పేర్లను తొలగించాలని జీవోలోఉంది.జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఫీజుల నియంత్రణ కమిటీ ఉంటుంది. ఈయన కింద జాయింట్‌ కలెక్టర్‌, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్ట ర్లు, ఎమ్మార్వోలు, ఉప విద్యాధికారు లు, పాఠశాల ఉప పర్యవేక్షణాధికారులు ఉన్నారు. (ఆంధ్రజ్యోతి 9.11.2009)--Nrahamthulla 04:56, 9 నవంబర్ 2009 (UTC)

Return to "పాఠశాల" page.