చర్చ:భారతదేశ ప్రాంతీయ భాషల ప్రాముఖ్యం

Importance to our languages

మార్చు

మన దేశములో ఒకోక్క ప్రాంతానికి ఒకొక్క భాష ఉంది. వానిలో హిందీ దేశ భాష అయింది మిగిలినవి వాని వాని ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అసలైన మరియు పూర్వకాలము నుండీ వాడుకలో ఉండి ఎన్నో గోప్ప గ్రంధాలు రచించుటకు ఉపయోగించిన సంస్క్రతమును వెనుకకు తోసేస్తున్నాము. ఈ భాష చాలా కష్టమైనదని ఎంతో ఓపిక ఉన్నవారే నేర్చుకుంటారని, అయినా ఈ భాష ఈ కాలములో ఎందుకు ఉపయోగపడుతుందని రకరకాల అభిప్రాయాలు వింటున్నాము. ఇటీ వల జరిగిన ఒక సంస్క్రుత భాషా సదస్సులో ఈ భాష ఎంత గొప్పదో నిరూపించారు. ఈ ఆధునిక కాలంలో ఏదైనా ఒక భాషను వెంటవెంటనే ఇతర భాషలలోకి తర్జుమా చేసి వినిపించడానికి ఎన్నో మిషనులు కనుగొన్నారు. అవి కూడా కొన్ని కొన్ని మాటలను సరిగ్గా చేయలేక పోతున్నాయి. అవి మాట్లాడే విధానాన్ని, ధ్వనిని బట్టి అవి పనిచేస్తాయి. అందువలన వివిధ భాషలలో ఈ విధానాలూ- ధ్వనులలో తేడాలు ఉండడం వలన ఈ ఆధునిక పరికరాలు కొన్ని మాటలను వివిధ రకాలుగా అంటే ఆభాషలో ఆశబ్దానికి తగిన లేక అతి దగ్గరగా ఉన్న శబ్దంలోకి మారుస్తాయి. అందువలన మాటలు మారిపోవడము కూడా జరుగుతూ ఉంటుంది. ప్రపంచ భాషలన్నిటికీ ఈ యిబ్బంది ఉంది. కానీ ఒకే ఒక్క ప్రత్యేకమైన భాష ఉంది. ఈ భాషనుపయోగిస్తే ప్రపంచ భాషలన్నిటిలోకీ సరిగ్గా తర్జుమా చేయవచ్చును. ఆభాష మరేదోకాదు మన సంస్క్రుత భాష.ఈ విషయము నిరూపించబడింది కూడా. ఈ భాషను తెలుసుకొని మన వేదాలలోని వైగ్నానిక విషయాలను తెలుసుకొనే ప్రయత్నంచేయాలి. madhuriprakash 05:24, 3 డిసెంబర్ 2007 (UTC)మాధురీరావ్2007

సంస్కృతము నిస్సందేహముగా గొప్ప బాష. సంస్కృతమును గూర్చి మరి ఏ ఇతర బాషల గురించి అయిననూ మీకు తెలిస్తే వాటికి సంబందించిన సమాచారములతో వ్యాసములను రాసేందుకు ప్రయత్నించండి. అలాగే అనువాద విషయములగురించి మీకు తెలిసినట్లున్నది. వాటిని గురించి కూడా వ్యాసములు మొదలు పెట్టగలరు..విశ్వనాధ్. 05:58, 3 డిసెంబర్ 2007 (UTC)
Return to "భారతదేశ ప్రాంతీయ భాషల ప్రాముఖ్యం" page.