చర్చ:భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ గీత రచయిత
ఈ వ్యాసానికి భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ గీత రచయిత అని పేరుపెడితే బాగుంటుందనిపిస్తుంది. ఇంకా ఏ పాటకి బహుమతి వచ్చిందో అనే సమాచారము కూడా చేర్చగలిగితే సమగ్రముగా ఉంటుంది --వైఙాసత్య 03:01, 17 జూన్ 2006 (UTC)
వైజాసత్యా, నేనూ పేర్ల విషయంలో సంగ్ధిగ్దంలో ఉన్నాను. మీరు పేర్కొన్నట్టు Template:జాతీయ సినిమా పురస్కారాలు మూసను (లేదా వేరే ఏదైనా తగిన పేరుగల మూసను) సవరించండి. ఆ లింకులను ఉపయోగించి మిగిలిన విభాగాలను పూర్తిచేయగలను. ధన్యవాదములు - శ్రీనివాస 04:04, 17 జూన్ 2006 (UTC)
- నేను మూసలో తగిన మార్పులు చేశాను --వైఙాసత్య 15:06, 17 జూన్ 2006 (UTC)
సంవత్సరాల పొంతన
మార్చుఈ పేజీలోని సంవత్సరాల కి ఈ వెబ్‌సైటులో ఇచ్చిన సంవత్సరాలకి పొంతన కుదరట్లేదు. ఏవి ఖచ్చితమైనవో అర్ధం కావట్లేదు --వైఙాసత్య 14:43, 19 జూన్ 2006 (UTC)
ఆంగ్ల వికీపీడియాలోని వ్యాసాన్ని తీసుకుని దీనిని కూర్చడం జరిగింది. మీరు తెలిపిన దానిని బట్టి నేను ఈ వ్యాసాన్ని మీరు పైన తెలిపిన వేరే రిఫరెన్సుతో పోల్చిచూడడగా ఒక విషయము అర్ధమైంది. ఈ వ్యాసములో ఉన్న సంవత్సరాల కంటే మీరిచ్చిన రిఫరెన్సులో ఒక సంవత్సరం తక్కువగా ఉన్నది. కానీ మిగిలిన విషయాలు అదే వరుసలో ఉన్నాయి. ఈ అధికారిక వెబ్ సైట్ లో చూస్తే తేలిన విషయమేమిటంటే ఈ వ్యాసములో ఉన్న సంవత్సరములు ఈ అవార్డు ప్రకటించిన సంవత్సరములు. కానీ అవార్డు ప్రకటించినది మాత్రం గడచిన సంవత్సరాలకు. తగిన మార్పులు చేయగలరని అశిస్తున్నాను. -- శ్రీనివాస 18:47, 19 జూన్ 2006 (UTC)
- అయితే మనము అధికారిక పద్ధతినే పాటిద్దాము. సంవత్సరాలు మార్చావల్సిన అవసరము లేదు. కానీ సంఖ్య (ఉదాహరణకి 52, 51) జోడిద్దాము --వైఙాసత్య 23:44, 19 జూన్ 2006 (UTC)