చర్చ:యానాం
:: యానాం వ్యాసంలోని సమాచారపెట్టె ఆంగ్లంలో ఉంది.దీనిని తెలుగులోకి అనువదించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
బాగుంది
మార్చుయానాం పై ఆర్టికిల్ బాగున్నది. ఇంకా కొన్ని వివరాలకై http://sahitheeyanam.blogspot.com/ ను దర్శించండి. బొల్లోజు బాబా
అభివృద్దికి యానాం ఆదర్శం
మార్చు- తూర్పుగోదావరి జిల్లాలో అంత ర్భాగంగా ఉండి కేంద్రపాలిత ప్రాంతమైన యానాం అభివృద్ధి ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఎనిమిదవ ప్రజా ఉత్సవాలలోఅన్నారు.ద్రాక్షారామ రోడ్డు, యానాం ముఖద్వారం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని రోశయ్య ఆవిష్కరించారు. ప్రభుత్వ ఐటీఐ నూతన భవనాన్ని పుదుచ్చేరి గవర్నర్ ఇక్బాల్‌సింగ్, ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్‌ను పుదుచ్చేరి ముఖ్యమంత్రి వైద్యలింగం ప్రారంభించారు.సభలో సీఎం రోశయ్య మాట్లాడుతూ యానాం పర్యాటక రంగంలో అభివృద్ధి చెందుతుందని, ఇతర ప్రాంతాలకు చెందినవారు యానాంను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.పెర్రీ రోడ్డులో రిలయన్స్ సహకారంతో నిర్మించిన 26 అడుగుల భరతమాత కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.(ఆంధ్రజ్యోతి7.1.2010)
యానాం అభివృద్ధికి సహకరిస్తా
మార్చుయానాం ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి కె రోశయ్య పేర్కొన్నారు.యానాం ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందని ఈ అభివృద్ధికి కృషి చేసిన యానాం ప్రజా ప్రతినిధి పుదుచ్చేరి రెవెన్యూ శాఖా మంత్రి మల్లాడి కృష్ణారావును రోశయ్య కొనియాడారు. మంత్రి మల్లాడి లాంటి చిత్తశుద్ధిగల నాయకుడు దొరకడం యానాం ప్రజల అదృష్టం అని తెలిపారు. మంత్రి మల్లాడి ప్రజల అభిష్టానికి అనుగుణంగా పనిచేస్తూ ప్రజల ఆదరణ మన్ననలు పొందుతున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు,నాయకులు, మంత్రి మల్లాడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి యానంలో మంచినీటి చెరువుల నిర్మాణానికి అడిగిన వెంటనే ఆంధ్ర భూభాగంలో 55 ఎకరాల భూమిని యానాంకు బదలాయించారని యానాంకు వైఎస్‌ఆర్ ఎంతో సహాయ సహకారాలు అందించారని యానంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌భారీ విగ్రహం వైఎస్‌ఆర్ సహాయ సహకారాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.(సూర్య7.1.2010)