“రామజోగి వైష్ణవులు”


“రామోజీ” మరియు “యోగి” పదాల కలయికనే “రామజోగి” మరియు “రామోజీ” మరియు “యోగుల” పదాల కలయికనే “ రామజోగులు” గా పిలువ బడుతున్నారు. రామోజీ అనగా భగవత్ స్వరూపుడైన “శ్రీ రాముడు” యోగి అనగా “ సాదువు” లేదా “ఋషి” లేదా“ ముని” లేదా “ భక్తుడు ” అని అర్థం. రామజోగులు ప్రదానంగా, శ్రీ నామాన్నే స్మరిస్తూ, శ్రీ రామ కీర్తనలనే, శ్రీ రామ నామాన్నే ప్రధాన మందుగా బావిస్తూ రామ అమృత పానాన్ని లోకానికి తెలియ చేస్తూ వృత్తి రిత్యా చెట్ల ఆకులు, పసరికలు మూలికలు, ద్వార కటినమైన రోగాలని నయం చేస్తూ జ్యోతిష్యం వంటి శాస్త్రాలలో వాటిలో ప్రావీణ్యత పొంది జీవిస్తున్నారు. రామజోగులు ఇచ్చే మందుని “రామజోగి మందు” అని పిలుస్తారు. ఎంతో కటినమైన కర్మ ఫలాలని పోగొట్టే మహత్తరమైన ఔషదం “రామనామం” రామ అనే అక్షరాలు నా”రా”యణాయ, న”మ”శివాయ లోని కీలక అక్షరాల సముదాయం తో “రామ” అనే నామం ఏర్పదినదని, రామ నామాన్ని జపిస్తే శ్రీ హరి వేయినామాలు పటించినట్లు అని శివుడు పార్వతి తో స్వయంగా విష్ణు సహస్రనామ పల శ్రుతిలో తెలియ చేశాడు. రామజోగి మందు మహాత్యముని భక్త రామదాసు భద్రచల కీర్తనల ద్వార రామజోగి మందు మహాత్యముని గురించి “ రామజోగి మందు కొనరే” అనే కీర్తన ద్వార వివరించినారు. పూర్వము త్రేతాయుగకాలము నుండి సాక్షాత్తు భగవత్ స్వరుపుడైన శ్రీ రాముడు మరియు వారి పూర్వికుల నుండి రామజోగి/రామజోగుల వారు ప్రత్యక్ష మరియు పరోక్ష సేవలు చేయుచున్నారు. రామజోగి కులానికి ఈ పేరు రాముని పేరుమీద నామకరణం చేయడం జరిగింది.

పూర్వకాలంలో దశరథ మహారాజు గారికి రాచపుండు కావడం వలన తీవ్ర అవస్థకు గురిఅవుతాడు. తనకు అయిన రాచపుండును నయం చేయడానికి తన రాజ్యములో ఉన్న వివిధ రాజవైద్యులను, యోగులను, పండితులను, సంప్రదించి తన జబ్బు(వ్యాది)ని నయం చేయడానికి వారి వద్ద నుండి సలహాలు తీసుకుంటాడు. అప్పుడు రాజవైద్యులు, యోగులు, పండితులు, రాజు గారి రాచపుండు కేవలం శారీరక పరమైన, మానసిక పరమైన, వైద్య శాస్త్రాలు తెలిసిన రామ నమ స్మరణ చేస్తూ భావ రోగాలని సైతం క్షీనింప చేసే నయం చేసే రామజోగి మూలిక వైద్యం ( రామజోగి మందు ) ద్వారానే నాయమగుతుందని వారు చెప్పడం జరుగుతుంది.

రామజోగి వైద్యం గురించి తెలుసుకున్న దశరథ మహారాజు గారు వారి రాజ్యo లో ఉన్న రామజోగి / రామజోగుల ను తమ రాజ్యం లోకి ఆహ్వానించిన తర్వాత రామజోగులని మునుల వలే ఉన్న రామజోగి మునులని చూసి ఆచర్యచకితులు అగుతారు. రామజోగి వైద్యం లో భాగంగా రామజోగుల దగ్గర శారీరక వైద్యం కొరకు చెట్ల మూలికలు, చెట్లయేర్లు, జ్యోతిష్య సంభదిత తాళ్ళాపత్ర గ్రంధాలు, మానసికమైన వైద్యంలో భాగంగా తాంబుర్ర, దైవస్మరణ చేయుటకు గజ్జెల-ఛిరుతలు, శివ అవతారాలని ఆరాధన చేయుటకు డమరుకము, విష్ణు అవతారాలు అరాధన చేయుటకు ఘంటలు కలిగి ఉన్న రామజోగులని చుసిన దాశరథ మహారాజు ఆచర్యశకితులు అగుతారు. వైద్య శాస్త్రం లో పండితులైన రామజోగుల తనకు ఆయుర్వేద పసరికల వైద్యం (రామజోగి మందు) ద్వార వ్యాదిచే భాదల నుండి విముక్తుడని చేయాలనీ కోరుతాడు అటువంటి సమయం లో రామజోగి చెట్ల పసరికలతో మందు తాయారు చేసిన తరువాత దశరథ మహారాజు గారికి మందుని యిచ్చె ముందు ధశరథ మహారాజు కులదైవము శివుడు కావడం వలన రామజోగి తను తాయారు చేసిన చెట్లపసరికల మందుని శివుని ముందు పెట్టి శివ ఆరాదన డమరుకము తో చేసి రామ నామాన్ని స్మరిస్తూ, రామజోగులు మహారాజు గారికున్న అనారోగ్యముని వ్యాదిని వైద్యం చేసి ఆయుర్వేదిక చెట్ల పసరికల ద్వారా నయం చేయడం జరుగుతుంది. రామజోగి/ రామజోగుల మందు వైధ్యాన్ని మెచ్చుకున్న దశరథ మహారాజు గారు రాచ మర్యాదల తో కట్నకానుకలు, ధన, దాన్య, వస్త్ర పరమైన కానుకలు, సత్కారాలు, చేసి క్షత్రియ వర్గానికి రామజోగి మూలిక వైద్యం( రామజోగి మందు ) ద్వార సేవ చేసినందుకు గాను రాముని వర్గ సేవకులు గా కీర్తిoచి “శ్రీ క్షత్రియ రామజోగి” అనే పేరును నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుండి రామజోగులని “రామక్షేత్రము” లో నివసించడం వలన వీరిని “క్షేత్రియ రామజోగి” అని కూడా పిలిచేవారు.

రామజోగి ఆయుర్వేదిక ములిక వైధ్యానికి ( రామజోగి మందు ) పురాతనకాలం నుండి చాల ప్రాముఖ్యం ఉందనే విషయాన్నీ భక్త రామదాసు కీర్తనల ద్వారా మనకు తెలుస్తుంది. భక్త రామదాసుగారు బద్రాద్రి రాముని భక్తుడని మనందరికీ తెలుసు. భద్రాది రామదాసు గారు రామజోగి మందు గురించి తన కీర్తనల ద్వార రమజోగి మహత్యాన్ని వివరించినాడు

రామదాసు కీర్తన :

రామజోగి మందు కొనరే ఓ పామరులారా..... రామజోగి మందు మీరు ప్రేమతో భుజియియించినపుడే.....

       కామ క్రోద్రములనేల్ల ప్రాలద్రోలె రామజోగి మందు కొనరే ఓ పామరులారా.....

భద్రాచల రామదాసు గారు రామజోగి మందుని గురించి కీర్తించడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, శ్రీ రామదాసు గారు తానాషా ప్రభువు ఆస్థానములో కొలువు చేయుచున్నప్పుడు పన్నుల రూపకంగా వచ్చిన సంపదను భద్రాచలము లో రామ మందిరమును నిర్మిచటం లో ఉపయోగిస్తారు. తానాషా ప్రభువు పన్నుల రూపకములో వసులయిన సంపదను పంపక పోవడం వలన ఆగ్రహించిన తనస రామదాసుని కారాగార దండన విదించడము జరుగుతుంది. తానాషా తనరాజ్యం లో వసులయిన సంపదచెల్లించే వరకు రామదాసు గారిని చిత్ర హింసలకి గురిచేయమని ఆదేశిస్తారు.

 తానాషా మహారాజ అజ్ఞానుసారం భటులు రామదాసు గారిని  చిత్రహిమసలకి గురిచేస్తారు. అయినప్పటికీ రామదాసు గారు రామనామ స్మరణ శ్రీ రామ కీర్తనలు చేసినాడు. అటువంటి కీర్తనలలో “ చరణములే నమ్మితి “  “ సీతారామ స్వామి నేను చేసిన పాపమేమీ “  “ రామజోగి మందు కొనరే “ వంటి కీర్తనలని పాడుతాడు. ఈ (రామజోగిమందు కొనరే) కీర్తన ని పడతానికి గల కారణమేమిటంటే శ్రీ రామ చంద్రున్ని , భక్త రామదాసు  తన భాదలనుండి విముక్తిడిని చేయడానికి ప్రాదేయపడుతూ, వేడుకుంటూ, కొన్ని సందర్భాలలో పొగుడుతూ, నిందిస్తూ, నీకు మతి బ్రమించినది అంటూ అనేక రకాల  వివిధ కీర్తనలు చేసినాడు. అటువంటి సందర్భం లో శ్రీ రామున్ని వేడుకుంటూ భక్త రామదాసు గారు రామజోగి మందు మహత్యం గురించి తగు సలహా ఇస్తున్నాడు. ఎందుకంటే కంటే పూర్వ కాలంలో దశరథ మహారాజు గారికి వ్యాది  (జబ్బు) అయినప్పుడు రామజోగి మందు వైద్యం ద్వారానే నయమైనది. నీవు కూడా రామజోగి మందు ద్వార వైద్యం చేసుకొని సలహా ఇస్తాడు.  ఎందుకంటే  రామజోగి  మందు కోటి ధనముల యిచ్చినగాని అంతటి మహత్యం గల మందు ఈ జగత్తులో ఎక్కడ కూడా లబించదు. భగవంతులు సైతం రామజోగి మందు ని స్మరణ చేస్తూ భుజించడానికి ఇష్టపడుతారు. 

శ్రీ క్షత్రియ రామజోగి (రామజోగి/రామజోగుల) వారి ఆచార-సంప్రదాయ జీవన పద్ధతులు సమాజ సేవ మార్గములో సంచార జీవనమును కొనసాగించిన సంచార కులాలలో (Nomadic Tribes) శ్రీ క్షత్రియ రామజోగి కులానికి ప్రత్యేక స్థానం ఉన్నది సమాజములో రామజోగి/రామజోగుల అనే పేరుతో పిలుస్తారు. వీరిని రామజోగి/రామజోగుల కులం వారు అని పిలిచినప్పటికి వీరు క్షత్రియ రాముని వర్గ సేవికులుగా (శ్రీ క్షత్రియ రామజోగి) పిలువ బడుతున్నారు. సంచార జీవనములో బాగంగా పురాణం ఇతిహాసాలని పాటల రూపకంగా కీర్తనల రూపకంగా కథల రూపకంగా రామనామ స్మరణాన్ని రామజోగి మందుగా సమాజానికి తెలియజేస్తూ వృత్తి పరంగా ఆయుర్వేదిక చెట్ల పసరికల ద్వార వివిధ వ్యాదులని నయం చేయడం లో సిద్ద హస్తులు. రామజోగులు ప్రదానంగా మానసికమైన శారీరక వ్యాదులకి, మానసికమైన వ్యాదులని నయం చేస్తారు రామజోగి, రామజోగుల కులానికి చెందిన వారు ప్రదానంగా కరీంనగర్, మహబూబాబాద్, సిద్ధిపేట, బద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట,మేడ్చెల్,హైదరాబాద్, జిల్లాల్లో జేవిస్తున్నారు.

రామజోగి శారీరక సంబందిత వ్యాదులకి వైద్యం : ఎవరైనా వ్యక్తికి గాయాలు కానీ శారీరక అవస్థలు, కడుపు నొప్పి నడుము నొప్పి, కీళ్ళనొప్పులు వంటి వాటిని చెట్ల పసరికల ద్వార నయం చేయబడుతుంది.

రామజోగి మానసిక సంబందిత వ్యాదులకి వైద్యం: ఎవరైనా వ్యక్తికీ మనసికమైన వ్యాదులు సంభవిస్తే రామజోగి తన వద్ద ఉన్న చెట్ల పసరికల ద్వారానే కాకుండా నీతి కథలద్వారా, పురాణ ఇతిహాసాల నీతి కథల ద్వార, వివిధ చరిత్రల ద్వార, నీతి కథలతో బోదనలు చేసి వారికీ ఆ కథల ద్వార నీతి పధ్యాల-తాత్పర్యాల నుండి నీతిని గ్రహి౦పచేసి మానసికంగా వ్యాది గ్రస్తుని ఆలోచనలని మానసిక ప్రశాంతత వైపు, ఉన్నతంగా ఆలోచించే విదంగా తాయారు చేస్తారు.

రామజోగి వైద్యం అనేది సూర్యోదయం కంటే ముందే ప్రారంభమగుతుంది. ఎందుకంటె వ్యాది గ్రస్తులకి చెట్ల పసరికలని (ఉదయమే) పరిగడుపుననే కొన్ని వ్యాదులకి ఇవ్వవలసి ఉంటుంది. రామజోగి వ్యాది గ్రస్తులని నయం చేసే నిమిత్తం వివిధ గ్రామాలని సంచారం చేస్తూ ఉంటారు. ప్రదానంగా రామజోగి వైద్యుడు తెల్లని రుమాలు,తేలని చొక్కా, తెల్లని పంచ, పొడుగు నామము (పొడుగు బొట్టు-తిరునామాల బొట్టు) దరించి చేతికి జోలె (చెట్ల పసరికలు కలిగిన సంచి) కలిగి ఉంటాడు. రామజోగి దగ్గర ప్రధానంగా రామజోగి వైద్యం లో భాగంగా రామజోగి దగ్గర శారీరక వైద్యం కొరకు చెట్ల మూలికలు, చెట్లయేర్లు, జ్యోతిష్య సంభదిత తాళ్ళాపత్ర గ్రంధాలు, మానసికమైన వైద్యంలో భాగంగా తాంబుర్ర, దైవస్మరణ చేయుటకు గజ్జెల-ఛిరుతలు, శివున్నీ శివ అవతారాలని ఆరాధన చేయుటకు డమరుకము, విష్ణు, విష్ణు అవతారాలను అవతారాలు అరాధన చేయుటకు గంటల నికలిగి ఉంటారు. శారీరక లేక మానసిక వ్యాదులనుండి బాధపడేవారు (రోగులు) ముందుగ తన వ్యాదులని త్వరగా తగ్గించమని దేవునికి ప్రార్థన చేస్తారు. తరువాతనే వైద్యులనే సంప్రదిస్తారు.అదేవిదంగా రామజోగి శారీరక ,మానసిక వైద్యం లో చెట్ల పసరికలని రోగులకి ఇచ్చె ముందు రామజోగి సైతం పసరికాలని దైవ విగ్రహాల ముందు పెట్టి దైవ ప్రార్థన చేస్తాడు. ఒకవేళ వ్యాది గ్రస్తుడు శివునికి, శివ అవతారాలకి పూజ చేసేవారైతే రామజోగి శివపూజ చేసేటప్పుడు డమరుకమును ఉపుతూ పూజ చేస్తాడు. ఒకవేళ విష్ణు,విష్ణు అవతరాలకి పూజ చేసేవారైతే రామజోగి గంటలు ఉపుతూ విష్ణు ఆరాధన చేస్తాడు. తరువాత వ్యాది గ్రస్తునికి చెట్ల పసరికలతో చేసిన మందు ఇవ్వడం జరుగుతుంది. రామజోగి వైద్యం చేసినందుకు ప్రతిపలంగా ధన,ధాన్య,వస్త్ర,బంగారు, రూపములో కానుకలను సంభావనలని ఇస్తారు. ఈ ప్రక్రియని సమాజములోని బయటి వ్యక్తులు రామజోగి భిక్షాటన చేస్తున్నట్లుగా చిత్రీకరించ బడుతున్నది. కానీ రామజోగి చేసే వైద్య సేవ చేసినందుకు కట్న కానుకలు తీసుకొంటున్నారని బావిచడం లేదు.


రామజోగి చెట్ల పసరికల వైద్యం సమజములో కనుమరుగై పోవడం, మారుతున్న పరిస్థితులకి రామజోగి వైద్యానికి ఆదరణ లేకపోవడం వలన, ఈ రామజోగి వృతి అంతరించే దశకి చేరింది. అయినప్పటికీ కొన్ని కుటుంభాలు వ్యవసాయ ఆధారంగా జీవనముని కొనసాగిస్తున్నారు. మరికొన్నికుటుంభాల వారు జీవనాధారము లేక, ధరిద్ర్యంలో కొట్టుమిట్టాడుతు భిక్షాటన చేయుచున్నారు.

భాష: శ్రీ క్షత్రియ రామజోగి (రామజోగి/రామజోగుల) కులానికి చెందిన వారు ప్రదానంగా తెలుగు, హిందీ,మాట్లడుతారు. రామజోగుల వారకి ఇతర ప్రత్యేక భాష ఏమి లేదు. పుట్టుక: రామనామ స్మరణతో రామనామ సేవతో క్షత్రియ వర్గ సేవికులుగా శ్రీ క్షత్రియ రామజోగి గా పేరు గాంచడమైనది. పూర్వము త్రేతాయుగకాలము నుండి సాక్షాత్తు భగవత్ స్వరుపుడైన శ్రీ రాముడు మరియు వారి పూర్వికుల నుండి శ్రీ క్షత్రియ రామజోగి (రామజోగి/రామజోగుల) వారు ప్రత్యక్ష మరియు పరోక్ష సేవలు చేయుచున్నారు. శ్రీ క్షత్రియ రామజోగి కులానికి ఈ పేరు రాముని పేరుమీద నామకరణం చేయడం జరిగింది. సంచార జీవనములో బాగంగా పురాణం ఇతిహాసాలని పాతాళ రూపకంగా కీర్తనల రూపకంగా కథల రూపకంగా సమాజానికి తెలియజేస్తూ వృత్తి పరంగా ఆయుర్వేదిక చెట్ల పసరికల ద్వార వివిధ వ్యాదులని నయం చేయడం లో సిద్ద హస్తులు. రామజోగులు ప్రదానంగా మానసికమైన శారీరక వ్యాదులకి, మానసికమైన వ్యాదులని నయం చేస్తారు. శ్రీ క్షత్రియ రామజోగి ( రామజోగి/రామజోగుల ) కులానికి చెందిన వారు ప్రదానంగా కరీంనగర్, మహబూబాబాద్, సిద్ధిపేట, బద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, మేడ్చెల్ జిల్లాల్లో జీవిస్తున్నారు.

రామజోగి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "రామజోగి" page.