మీరు రోకలి అనే వ్యాసం వ్రాసారు. అదే విధంగా రోలు అనే వ్యాసం రాస్తే బాగుండేది. రోలు రోకలి కలిపి వ్యాసం అవసరంలేదని నా అభిప్రాయం. రసాయన శాస్రంలో మిశ్రమాలను తయారుచేయు కల్వం అనే చిత్రమును కూడా ఇందులో చేర్చారు. ఆ చిత్రమును తొలగిస్తే బాగుండునని నా అభిప్రాయం.( కె.వి.రమణ- చర్చ 13:30, 5 డిసెంబర్ 2012 (UTC))

మీరు రచించిన సూక్ష్మ వ్యాసం.(వ్యాసం అనే కన్నా వాక్యం అనిన బాగుండును) బాగుంది. కాని మీరు రోకలి అనే వ్యాసం వ్రాసారు. ఇపుడు రెండింటి తో వ్యాసమెందుకు? మీకు మరే ఇతర అంశాలపై అవగాహన లేదని తెలియుచున్నది. రోలు వ్యాసం వ్రాయునపుడు. దాని నిర్మాణం,తయారీ విధానం, దాని ఉపయోగాలు వంటి అంశాలు జోడించాలి. ఒకవాక్యం పది బొమ్మలు. అవీ సంబంధం లేని బొమ్మలు. మీరు రోలు చిత్రం చేర్చలేదు. రోలు తో పాటు గొడ్డ రోలుతో బాటు రోకలి, కల్వం , ఆయుర్వేదం లో మందులు తయారీ చేసే కల్వం వంటి సంబంధం లేని బొమ్మలు ఉంచారు. మీకు విషయ ప్రాధాన్యత అవసరం లేదు. మీరు తీసిన ప్రతి చిత్రం అవసరం లెకపోయినా చేర్చుతున్నారు. విషయాన్ని చేర్చి సహకరించండి. మీ వ్యాసం ఆంగ్ల వికిపీడియా వాడుకరులు చూస్తే మన తెలుగుదనం మీద గౌరవం పోతుంది. దీనిని మీరు గమనించగలరు. (Rojarani (చర్చ) 13:39, 5 డిసెంబర్ 2012 (UTC))

రోలు, రోకలి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "రోలు, రోకలి" page.