చర్చ:వచన కవిత్వం

తెలుగులో పద్య కవిత్వం, వచన కవిత్వం, గేయ కవిత్వం అనే విభాగాలున్నాయి. వచన కవిత్వానికి ఉండే లక్షణాల గురించి కోవెల సంపత్కుమారాచార్య, చేకూరి రామారావు తదితరులెంతోమంది చర్చించారు. పద్య కవిత్వంలో ఛందస్సు ప్రకారం కవిత్వం రాయాలి. వచన, గేయ కవిత్వంలో మాత్రాఛందస్సు, లయలను బట్టి కవిత్వాన్ని రాస్తుంటారు. విశ్వనాథ సత్యనారాయణ రాసినది అత్యధికంగా పద్య కవిత్వం. శ్రీశ్రీ రాసింది గేయకవిత్వం. ఆధునిక కవులు అత్యధికంగా రాస్తున్నది వచన కవిత్వం.

Return to "వచన కవిత్వం" page.