చర్చ:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు
తాజా వ్యాఖ్య: సమాధానం టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Vemurione
ఉపోద్ఘాతంలో "విద్యుత్ ప్రసార మాధ్యమాలలో ...." అని electronic media కి వాడితే సరిపోలేదు. వేమూరి వారే కి వైద్యుత అని ఇచ్చారు. వైద్యుత మాధ్యమం అనేది సరియైన పదం అని సూచన.13:45, 9 సెప్టెంబరు 2015 209.183.246.114 (చర్చ • నిరోధించు)
సమాధానం
మార్చుఈ విషయం చర్చించడానికి ముందుకి వచ్చినందుకు ముందుగా నా ధన్యవాదాలు. నిఘంటువులో electronic అన్న మాటకి వైద్యుత అన్న అర్థం ఉంది. కనుక వైద్యుత మాధ్యమం అనే ప్రయోగం వాడొచ్చు. తప్పు లేదు. సాంకేతిక రంగంలో మనకి తారసపడే ఇంగ్లీషు మాటల అర్థాలకి ఫలానా తెలుగు మాటలే వాడాలనే నియమం ఇంకా స్థిరపడలేదు. ఈ స్థిరత్వం క్రమేపీ వాడుకలో నలగడాన్ని బట్టి ఉంటుంది. నిఘటువు భాష వాడుకని శాసించలేదు; వాడుకలో ఉన్న భాషని గ్రంధస్థం చేస్తుంది. Vemurione (చర్చ) 14:04, 14 సెప్టెంబరు 2015 (UTC)