ఈ ఊరి నామము సాయిపురం కాదు. శాయపురం అని వ్రాయలి.ఈ ఊరి చరిత్ర ప్రకారము, 16 శతాబ్దమునందు ఈ గ్రామము యెర్పడినది. ఆ రొజులలొ ఆ ప్రాంతము పరిపాలింఛుఛున్న నవాబుగారి హిందూ దివాను ఆ ప్రాంతమునకు గుర్రముమీద వచ్చెనట. అక్కడి చెరువు వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. ఆ చెరువు నీటి రుచి ఆయనకు ఇష్టమయినదట. అక్కద ఒక శివాలయము, ఒక విష్ణాలయము కట్టదలుఛుకొన్నాడు. నవాబు గారికి అక్కడ మసీదు కడుతున్నట్టు చెప్పి నిధులు తీసుకొని, ఈ ఆలయములు కట్టించినాడు. అక్కడకు కొంత దూరములొ ఒక మసీదు కూడా కట్టించినాడు. ఈ గ్రామమునకు షాహిపురమని నామము పెట్టెనట. కాలక్రమమున షాహిపురమ్ శాయపురంగా మారినదట. ఇది 16వ శతాబ్దమునందు జరిగినది కాబట్టి షిరిడి సాయికి ఈ ఊరి నామమునకు సoబంధము లేదు. ఈ ఊరి పేరు శాయపురమని వ్రాయాలి, సాయిపురం అని వ్రాయకూడదు.

పైన చెప్పిన విషయాలు, గ్రామానికి చెందిన శ్రీ చావలి భానుమూర్తి(83 సవత్సరముల వయస్సు) నేను ఆ ఊరు వెళ్ళి ఆయనను అడిగినప్పుడు (ఫిబ్రవరి 2008లో) చెప్పినవి. ఆయన ఈ వివరాలు చెప్తుండగా వీడియో కూడ తీశాను. ఇంతకంటే ఆ ఊరికి "శాయపురం" అని పేరు ఎలా వచ్చిందో దొరకలేదు. ఇంతకంటే వివరాలు పొందుపరచటం కష్టమనుకుంటాను. చాలా గ్రామాలకు వాటి వాటి పేర్లు ఎలా వచ్చినాయో ఎవరూ చెప్పలేని స్థితి ఉన్నది, వాటితో పోలిస్తే ఈ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చినదో చాల చక్కగా తెలిసినట్ట్లే.--SIVA 05:14, 7 నవంబర్ 2008 (UTC)

ఈ గ్రామమునకు శాయపురమని పేరు ఎలా వచ్చినదో సవివరముగా చెప్పబడినది కాబట్టి ఆధారము కోరబడినది అన్న వ్యాఖ్య తొలగించబడినది.--SIVA 03:14, 20 డిసెంబర్ 2008 (UTC)

శాయపురం గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "శాయపురం" page.