చర్చ:శ్రీరామగిరి

శ్రీ రామగిరి

ఈ గ్రామం ఖమ్మం జిల్లా వరరామచంద్రపురం మండలంలోని గ్రామం. ఈ గ్రామం గోదావరి నదీతీరాన ఉన్నది. ఒక ప్రక్క సుళ్ళు తిరుగుతూ పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే గోదావరి, మరో ప్రక్క కాకులు దూరని కారడవులతో నిరంతరం సంచరిస్తూ ఉండే అడవి జంతువులతో నిండి ఉండే ఎత్తైన కొండలతో పక్షుల కిలకిలా రావాలతో ఎంతో సుందరంగా ఉండే ఈ గ్రామంలో కొలువై ఉండే రాముడు "సుందర రాముడు" గా ఈ పరిసర ప్రాంత ప్రజలచేత కొలువబడుతుంటాడు. శ్రీరామగిరి అని ఈ గ్రామాన్ని పిలవడానికి ఒక కథ చెబుతారు.

దండకారణ్యంలో విహరిస్తూ సీతారామలక్ష్మణులు పర్ణశాల నిర్మించుకొని వనవాసం చేస్తుండగా మాయా రావణుడు సీతమ్మవారిని ఎత్తుకుపోవడంతో కలతచెందిన శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణునితో కలిసి అడవిలో వెతుకుతూ ఉండగా హనుమంతుడు కలుస్తాడు. హనుమంతుడు సీతాపహరం విషయం తెలుసుకొని, ఎంతో చింతించి, వానర రాజైన సుగ్రీవుని సహాయంతో సీతను వెతకవచ్చని చెప్పి మాతంగ ముని ఆశ్రమంలో తలదాచుకున్న సుగ్రీవుని రామునికి పరిచయం చేస్తాడు. వానర రాజు సుగ్రీవుడు, మహా బలవంతుడైన తన అన్న వాలి తన రాజ్యాన్నీ, భార్య తారనూ అపహరించుకుపోవడంతో భయపడి మాతంగ ముని ఆశ్రమంలో తలదాచుకున్న విషయాన్నితెలుసుకున్న శ్రీరాముడు వాలిని సంహరించి వాలి అధీనంలో ఉన్న సుగ్రీవుని రాజ్యాన్నీ,అతని భార్యనూ సుగ్రీవునికి అప్పగిస్తాడు.కృతజ్ఙతతో సుగ్రీవుడు సీతను వెతకడంలో తన సహాయాన్ని అందిస్తానని వాగ్దానం చేస్తాడు. ఐతే అది వర్షాకాలం కావడంతో వర్షాలు తగ్గే వరకూ మాతంగ ముని ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని సుగ్రీవుడు శ్రీరాముడిని కోరతాడు. ఆ సమయంలో శ్రీరాముడు మాతంగ ముని ఆశ్రమంలో దక్షిణాభిముఖుడై ధ్యానం చేస్తాడు.అందుకే ఈ క్షేత్రంలో శ్రీరాముడు దక్షిణాభిముఖుడై వెలిశాడని చెబుతారు. ఆ ధ్యానం వల్ల శ్రీరాముని ముఖంలో తేజస్సు వెలువడి ఎంతో సుందరంగా కనిపించిందట. అందుకే ఇక్కడ వెలిశిన శ్రీరాముడిని సుందర రాముడు అని పిలుస్తారు. శ్రీరాముడు బస చేసిన గిరి (కొండ) కాబట్టి శ్రీరామగిరి అని ఈ ఊరికి పేరు వచ్చినట్లు చెబుతారు. ప్రతి ఏటా శ్రీరామనవమికి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు చేస్తారు. భద్రాచలం నుండి 60 కి.మీ. దూరంలోగల ఈ ఊరికి భద్రాచలం నుండి బస్సు సౌకర్యం ఉంది.


నిమ్మన వెంకటరామయ్య, సీనియర్ సహాయకులు, కలెక్టర్ కార్యాలయం, ఖమ్మం. Ph.9885567929
email: friendkmm@rediffmail.com, friend_kmm@yahoo.com

శ్రీరామగిరి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "శ్రీరామగిరి" page.