చర్చ:శ్వాస మార్గం

తాజా వ్యాఖ్య: శ్వాసవృక్షములో పేరులు టాపిక్‌లో 3 నెలల క్రితం. రాసినది: డా. గన్నవరపు నరసింహమూర్తి

శ్వాసవృక్షములో పేరులు

మార్చు

శ్వాసవృక్షములో స్వరపేటిక దిగువ ఉన్న trachea ను శ్వాసనాళంగా వర్ణించినపుడు శ్వాసనాళం శాఖలు bronchi లను మఱల శ్వాసనాళాలుగా లేక శ్వాసనాళపు శాఖలుగా వర్ణిస్తే నిర్దిష్టత (specificity) ఉండదు. నిఘంటువుల్లో అలా అర్థాలున్నా విజ్ఞానశాస్త్ర వ్యాసాలలో నిర్దిష్టమైన పేరులు మనం నిర్ణయించుకోవాలని తలుస్తాను. ఆ శాఖలు చెరిపక్కా ఊపిరితిత్తులలోనికి పోతాయి కాబట్టి వాటికి నేను పుపుసనాళాలుగా పేరుపెట్టాను.పుపుసనాళాలు ఊపిరితిత్తుల్లో మరల lobar bronchi గా చీలుతాయి. Lobar bronchi segmental bronchi గా శాఖలవుతాయి. Lobar bronchi లను విభాగ పుపుస నాళాలని, segmental bronchi లను ప్రవిభాగ పుపుస నాళాలని నిర్దిష్టత కోసం వర్ణించాను. చిన్న చిన్న శాఖలకు పుపుసనాళికలని పేరుపెట్టాను. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 02:30, 10 జూలై 2024 (UTC)Reply

Return to "శ్వాస మార్గం" page.