చర్చ:సాని శబ్ద నిర్వచనము

    సాని-దేవదాసి శబ్దములు పూర్వము గౌరవవాచకములుగా నుండినవి. సాని శబ్దము శాస్త్రపరిభాష. ఈ పరిభాషననుసరించి స-ని అనే అక్షరాలు స-రి-గ-మ-ప-ద-ని అనే సప్తాక్షర సముదాయాన్ని సూచిస్తాయి. సంగీతశాస్త్ర సప్త స్వరములను-షడ్జ-రిషభ-గాంధార-మధ్యమ-పంచమ-ధైవత-నిషాదములని పరిగణనము చేసింది. వానిని ప్రత్యాహారము అనే పరిభాషననుసరించి ఆద్యంతస్వరముల సంకేతములతో-స-ని అని సంకేతరూపమున సప్తస్వరసముదాయముగా వ్యవహరిస్తారు. సఅనే వర్ణాన్ని సాాధనలో సా అని దీర్ఘంగా ఆలపిస్తారు. రాజాస్థానములలో, సభలలో పూర్వము సంపూర్ణ స్వర,రాగ తాళ, లయపరిజ్నానమున్న విదుషీ మణులను సాని యను బిరుదముతో సత్కరించెేవారు. వీరు తమజీవితములను సంగీత,నృత్య కళలకు, దేవాలయములలో దేవుని సేవకు అంకితము చేసిన ధన్యురాండ్రు.వీరికి దేవదాసి యనే వ్యవహారము లోకంలో ప్రసిద్ధముగా నున్నది.  
    ప్రప్రథమముగా కనకాభిషేకసత్కారమునందిన తెలుగు కవయిత్రి పూర్వము తంజావూరు వీరరాఘవనాయకుని ఆస్థానములో పసుపులేటి రంగాజమ్మ,అట్లే 18వ శతాబ్దిలో రాధికాసాంత్వనమును వ్రాసి కీర్తిగాంచిన ముద్దుపళని  తంజావూరు ప్రభువైన రాజా ప్రతాప్ సింహుని భోగపత్నిగా దేవేరులతో సమానమైన గౌరవమునందుకున్నది. వీరిరువురును దేవదాసి కుటుఁబములోనివారే 
    తరువాతి కాలములో సానులు దేవదాసిలు ప్రలోభ ప్రతాడనములకు లోబడి సమాజములో వేశ్యలుగా పరిగణింపబడసాగుచున్నారని, మరియు వేశ్యలలో కూడ ప్రతిభాసమున్మేషముగల వారలు గౌరవింపబడుచున్నారు.
    శ్రీపాదుక ఆచార్య కోల్లూరు. అవతారశర్మ (కాశీవాసి)

సాని శబ్ద నిర్వచనము గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "సాని శబ్ద నిర్వచనము" page.