చర్చ:2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

2004 ఎన్నికలు అయిపోయి చాలా కాలమయింది. మళ్ళీ 2009 ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ వ్యాసం ఇంకా మొలకగానే ఉన్నది. ఇటువంటి విషయాలమీద వ్యాసాలు పూర్తి చెయ్యటానికి చాలా సమాచారం కావలిసి వస్తుంది. 294 నియోజకవర్గాలలో జరిగిన ఎన్నికల గురించి సమగ్ర సమాచారం ఉంటేనే పూర్తవుతుంది. వ్యాస లక్ష్యం ఏమిటి? 2004 ఎన్నికల గురించి సమగ్ర సమాచారం ఇవ్వటమా? సమగ్రమంటే ఎంతవరకు-ప్రతి నియోజకవర్గం లోని నిలబడిన అబ్యర్ధులు, వారికి వచ్చిన వోట్ల సంఖ్య తదితరాలు వ్రాయాలంటే చాలా సమాచారం కావాలి. ఇంత సమయాభావం జరిగి, మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, పాత ఎన్నికల గురించి సమగ్ర సమాచారం సంపాదించటం కష్టతరం. వ్యాస లక్ష్యం బాగుండి, పూర్తి చెయ్యటం కష్టతరమైన వ్యాసాలు, ఎప్పుడు పూర్తవుతాయో (కనీస స్థాయి సమాచారంతో) తెలియని వ్యాసాలను ఏమి చెయ్యాలో నిర్ణయించటానికి కొంత చర్చ అవసరం.--SIVA 05:46, 24 డిసెంబర్ 2008 (UTC)

పైవ్యాఖ్య వ్రాసిన తరువాత, వ్యాసానికి అనుసంధించిన రాష్ట్ర ఎన్నికల సంఘంవారి సమాచార నివేదిక చూశాను. క్షంతవ్యుణ్ణి. ఈ సమాచార నివేదిక సమగ్రంగా ఉన్నది. కాకపోతే, అది ఆంగ్లంలో ఉన్నది. తెలుగులో దొరికెతే బాగుంటుంది. లేదంటే మొత్తం తెలుగులోకి తర్జుమా చెయ్యగలగాలి. అనుబంధించిన నివేదికను లెక్కలోకి తీసుకొని, ఈ వ్యాస మొలక స్థాయిని తొలగించ వచ్చునా అన్ని విషయం నిర్ణయించాలి.--SIVA 05:58, 24 డిసెంబర్ 2008 (UTC)

2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు" page.