చలిమిడి
చలిమిడి వరిపిండితో తయారుచేసుకొనే ఆహార పదార్ధము. దీనిలో రెండు విధములు: పచ్చి చలిమిడి, పాకపు చలిమిడి. పాకపు చలిమిడి ఎక్కువకాలం నిలువ ఉంటుంది.
మూలము | |
---|---|
ఇతర పేర్లు | పచ్చి చలిమిడి, పాకపు చలిమిడి |
ప్రదేశం లేదా రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
తయారీదారులు | ప్రాచీన భారతీయులు |
వంటకం వివరాలు | |
వడ్డించే విధానం | వంటకం |
ప్రధానపదార్థాలు | బియ్యం పిండి, నెయ్యి, ఏలకల పౌడర్, బెల్లం, కొబ్బరి మొదలగునవి. |
రకాలు
మార్చు- పచ్చి చలిమిడి: బియ్యము నానబోసి, పిండిచేసి, బెల్లము లేక పంచదార కలిపి, అందులో కొబ్బరికాయ ముక్కలు లేదా కొబ్బరికోరు చేర్చి, నీరయినా లేదా పాలయినా పోసి కలిపి ముద్ద చేయుదురు. ఇది పచ్చి చలిమిడి.[1]
విశేషాలు
మార్చుఆడపిల్లను అత్తవారింటికి పంపే సందర్భాలలో ప్రతి సారీ కన్నతల్లి , తన కూతురికి చలిమిడి పెట్టి పంపిస్తారు. అలాగే గర్భవతి ఐన కుమార్తెకు మూడవ నెల రాగానే వియ్యాల వారి ఇంటికి వెళ్ళి కుమార్తె ఒడిలో చలిమిడి పెడతారు. కుమార్తెకు ఏడవ నెల రాగానే సీమంతం సందర్భంగా ముత్తయిదువులందరికీ ఇచ్చే తాంబూలాలలో చలిమిడి పెడతారు. కుమార్తె ప్రసవం అయిన తరువాత పుట్టిన బిడ్డకు మూడవ నెలలో కానీ, ఐదవ నెలలో కానీ బిడ్డతో పాటు కుమర్తెను అత్తవారింటికి పంపేటప్పుడు చలిమిడి పంపిస్తారు. ఇలా అన్ని శుభ సందర్భాలలో చలిమిడి కూతురుకు పెట్టి పంపడం అనేది తర తరాలుగా మన ఇళ్ళల్లో వస్తున్న సాంప్రదాయం. ఇలా చలిమిడి పెట్టి పంపడం తన బిడ్డకు కడుపు చలవే కాకుండా , ఇరు కుటుంబాలకు క్షేమకరం అని పెట్టి పంపుతారు.
మూలాలు
మార్చు- ↑ "Pachi Chalimidi from Andhra | Akki Thambittu from Karnataka". ãhãram (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-10-27. Retrieved 2021-04-15.