ఛార్లెస్ బాబేజ్

గణితవేత్త, మెకానికల్ కంప్యూటరు రూపకర్త.
(చార్లెస్‌ బాబేజ్‌ నుండి దారిమార్పు చెందింది)

ఛార్లెస్ బాబేజ్ (1791 డిసెంబరు 26 - 1871 అక్టోబరు 18) ఇంగ్లీషు గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త, మెకానికల్ ఇంజనీరు, నమూనా ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ను తయారు చేసిన ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త.[1] ఈయనను కంప్యూటర్ పిత అంటారు.[2]

ఛార్లెస్ బాబేజ్
1860 లో ఛార్లెస్‌ బాబేజ్‌
జననం(1791-12-26)1791 డిసెంబరు 26
లండన్, ఇంగ్లాండ్
మరణం1871 అక్టోబరు 18(1871-10-18) (వయసు 79)
మెరిల్‌బోన్, లండన్
జాతీయతఇంగ్లీషు
రంగములుగణితము, ఇంజనీరింగ్, పొలిటికల్ ఎకానమీ, కంప్యూటర్ సైన్సు
వృత్తిసంస్థలుట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్
చదువుకున్న సంస్థలుపీటర్ హౌస్, కేంబ్రిడ్జ్
ప్రసిద్ధిగణితము, కంప్యూటింగ్
ప్రభావితం చేసినవారురాబర్ట్ ఉడ్‌హౌస్, గాస్పార్డ్ మోంగే, జాన్ హెర్షెల్
ప్రభావితులుకార్ల్ మార్క్స్, జాన్ స్టూవర్ట్ మిల్
సంతకం
చార్లెస్ బబేజ్

వ్యక్తిగత జీవితము

మార్చు

1791 డిసెంబర్ 26 న బెంజిమన్, బెట్సీ దంపతులకు లండన్‌లో జన్మించారు. ప్రాథమిక,ఉన్నత విద్యాభ్యాసాలు ఇంటివద్ద, ప్రైవేట్ పాఠశాలలో జరిగాయి. పై చదువులకు 1810 లో కేంబ్రిడ్జి లోని ట్రినిటీ కాలేజీలో చేరాడు. అక్కడ లీబ్నిట్జ్, లగ్రాంజ్, సింప్సన్, లాక్రియాక్స్ లను చదివిన బాబేజ్, అక్కడి గణిత శాస్త్ర బోధనతో నిరుత్సాహపడి, జాన్ హెర్షల్, జార్జి పీకాక్ ఇంకా కోందరితో కలిసి 1812 లో విశ్లేషక సమాజాన్ని స్థాపించాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి గౌరవపట్టా పొందారు. కేంబ్రిడ్జ్‌లో గణితాచార్యుడిగా కొంతకాలం పనిచేసి మంచి గణిత శాస్త్రజ్ఞుడిగా పేరు తెచ్చుకొన్నారు. కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు చార్లెస్ బాబేజ్.

కంప్యూటర్ డిజైన్

మార్చు

గణిత శాస్త్ర పట్టికలలో అధిక దోషాలను నివారించడానికి, బాబేజ్ యాంత్రికముగా పట్టికలను తయారుచేసే విధానము కనుక్కోడానికి ప్రయత్నించాడు. బాబేజ్ ఇంజన్ మొదటి మెకానికల్ కంప్యూటర్. కాని అది నిధులు లేక అప్పటిలో నిర్మించబడలేదు. 1991లో ఛార్లెస్ అసలు ప్లాన్ తో ఒక డిఫరెన్స్ ఇంజన్ [తెలుగు పదము కావాలి]ను నిర్మిస్తే అది చక్కగా పనిచేసింది.

సొంతంగా గణనలు చేసే యంత్రానికి బాబేజ్ రూపకల్పన చేశారు. 'డిఫరెన్స్ ఇంజిన్', 'డిఫరెన్స్ ఇంజిన్ - II', సాంకేతికంగా ఎంతో ఉన్నతమైన 'ఎనలటికల్ ఇంజిన్ అనే యంత్రాలను తయారు చేశారు. వీటికి సంబంధించిన పత్రాలను చదివిన శాస్త్రవేత్తలు బాబేజ్ కృషిని ప్రశంసించారు. ఈ యంత్రాలు ప్రస్తుత కంప్యూటర్‌లా ఆలోచించి, సమస్యల సాధనను మానవ సాయం లేకుండా కనుక్కొనే విధంగా ఉన్నాయని భావించారు. బాబేజ్‌ను కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు అని పిలిచారు. రైల్వే సంస్థల కోసం 'పైలట్', 'డైనమో మోటార్ కారు', కంటి పరీక్షల కోసం 'ఆఫ్తాలమోస్కోప్' అనే పరికరాలను కూడా చార్లెస్ బాబేజ్ తయారు చేశారు. గణిత, ఖగోళ సంబంధ పట్టికలను గణన చేసే యంత్రాన్ని తయారుచేశాడు. ఈ పరిశోధనకు 1824లో రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ నుంచి బంగారు పతకాన్ని పొందారు. బాబేజ్ జ్ఞాపకార్థం చంద్రునిపై ఉన్న ఒక బిలానికి బాబేజ్ బిలం అని పేరు పెట్టడమే కాకుండా ఆయన పేరుమీద చార్లెస్ బాబేజ్ ఇన్‌స్టిట్యూట్ అనే సంస్థను కూడా స్థాపించారు. 1871లో 79వ ఏట మరణించారు.

మూలాలు

మార్చు
  1. Terence Whalen (1999). Edgar Allan Poe and the masses: the political economy of literature in antebellum America. Princeton University Press. p. 254. ISBN 978-0-691-00199-9. Retrieved 18 April 2013.
  2. Halacy, Daniel Stephen (1970). Charles Babbage, Father of the Computer. Crowell-Collier Press. ISBN 0-02-741370-5.

ఇతర లింకులు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.