చార్లెస్ బొదిలేర్
బొదిలేర్ ఫ్రాన్స్ దేశపు ప్రముఖ నిరాశావాది రచయిత, తత్త్వవేత్త. 1821లో జన్మించాడు. అప్పుడే శ్రామిక విప్లవోద్యమం ప్రారంభం అయ్యింది. నాగరికత తారుమారవుతున్న తరుణం. ఫ్రెంచి విప్లవం ఫలితంగా సాహిత్యంలో ప్రజాస్వామ్యభావాలు పొడచూసిన సమయం. అప్పుడే కవిత్వం కొత్తదారి పట్టిన సమయం.
జీవిత విశేషాలు-రచనలు
మార్చుబొదిలేర్ బాల్యం హాయిగా గడవలేదు. చిన్నతనంలోనే తండ్రి గతించాడు. తల్లి జనరల్ ఆపెక్ ను తిరిగి పెళ్ళి చేసుకోవడం వలన బొదిలేర్ కు మరింత నిరాశ పెరిగింది. తల్లిపట్ల ఆయనకు గాఢమైన ఆప్యాయత. అందుకు నిదర్శనంగా:ఆయనకు ఏడేంద్ల వయస్సులో తల్లి పడకగది తాళాలు కితికీలోంచి విసిరేసాడట.అందువలన్ పెళ్ళినాటి రాత్రి ఆమెతో గడపలేకపోయాడు తండ్రి.తల్లితండ్రులను ఈవిధంగా బాధపెట్టాక సాహిత్యం వైపు తిరిగాడు. ఆర్థికమైన ఇబ్బందులకు లోనయ్యాడు. రెండేసిరోజులు భోజనం లేకుండా, పడుకోడానికి పరుపులేకుండా, చలికాడటానికి కట్టెలు లేకుండా దుర్బర జీవితాన్ని అనుభవించానంటాడు తల్లికి వ్రాసిన లేఖలలో. బొదిలేర్ లేఖలను ఫ్రెంచిభాషలో 6 సంపుటాలుగా వెలువరించారు. అవే Les Fleurs du Mal ను పూర్తిచేయుటకు కావలిసినంత సంతోషపు ఘడియలు కొరవడినాయన్నాడు.ఆ పద్యాలను వెలువడించినప్పుడు దూషనలు ఎదుర్కోవలసి వచ్చింది. సిఫిలస్ అనే సుఖ వ్యాధి మూలకంగా పక్షవాతం వచ్చి నాయం కాకుండానే మరణించాడు.
బొదిలేర్ బాల్యంలో విపరీతమైన బాధను అనుభవించినట్లు జీవిత చిత్రకారులందరూ చెబుతారు. 1848 విప్లనంలో బొదిలేర్ ప్రముఖపాత్ర పోషించాడు. ఏ రాజకీయ పక్షానికి చెందినవాడు కాడు.ఏ రాజకీయ సిద్ధాంతానికి నివాళి పట్టలేదు.
పద్యాలలోను, లేఖలలోను వ్యక్తపరిచే బాధ దుఃఖము శుష్కసాహిత్య ప్రదర్శనాపద్ధతి కాదు బొదిలేర్ ది. విషాదానుభవఫలితం. బొదిలేర్ దుఃఖజీవి. నైతికఏకాంతత, భౌతిక అవసరాలు, ఉన్నతశిఖరం అందుకోలేక నిరాశ, శారీరికలోపాలు- వీటితో క్రుంగిపోయాడు.బొదిలేర్ ముఖ్యంగా Sensual Poet.సాంఘిక నైతిక బాధ్యతలునుండి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు.కేవలం ఇంద్రియానందాలను అధిగమించాలని ప్రకృతిసౌందర్యం ప్రేరేపిస్తున్నట్లుగా తన 17వయేట వ్రాసిన పద్యంలో అంటాడు.మానవదేహాన్ని భౌతిక సమ్మేళ్ఖనంగా కదిలే సుందరశిల్ప కళామూర్తిగా ప్రేమిస్తాడు. ఈ పూర్ణభౌతికవాదం స్వచ్ఛ భావసిద్ధాంతానికి దుర్రం కాదంటాడు.బొదిలేర్ తాత్త్వికత ఒక నిర్దిష్టమైన ఆలోచనా సరళితో కూడుకున్నటది కాదు. ఆయన వివేచన మానవుని ఉనికిని, మానవజాతి నిగూఢ గమ్యాన్ని విచారణచేయటం వరకే పరిమితం. కళ కళ కోసమే అన్న ఆస్కార్ వైల్డు అన్న వాదాన్ని ఖండిచాడు.
Le voyage లోను, Confession లోను, Spleen et ldeal లోను బొదిలేర్ దుఃఖం, బాధ, ఏవగింపు కనబడతాయి.
ప్రేమ, సౌందర్యం- ఈరెండు దుఃఖంగా పరిణమిస్తాయి; ఈ ప్రపంచంలో మృత్యువు తప్ప ఏదీ నిజంకాదని బొదిలేర్ అంటాడు, ఒక కవితలో. కవి జీవితంలో బాధ అనేది సామాజిక సత్యంగా అవభాసిస్తున్నది. ఈ బాధనుండి తప్పించుకోలేడు. ఈ బాధే విముక్తిమార్గం. దుఃఖం వలన ఆత్మ ప్రక్షాళన జరుగుతుంది. పాపాలను పోగొట్టే దివ్యభేషజం బాధ.అది ప్రసాదించిన భగవంతుడు శ్లాఘనీయుడని బొదిలేర్ భావించాడు.బాధని అనుభవించుటకు ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థించాడు.జీవితం పట్ల ద్వేషపూరితమైన అసహ్యభావం లేకుండా శరీరాన్ని మనస్సుని ప్రేమించే శక్తినివమని దేవుడి వేడుకున్నాడు. వర్తమానం నుండి పారిపోవటం, మరణిం, ప్రేమ, పాపం అవినీతి బొదిలేర్ మధ్యవయస్సులో ఆవరించాయి. స్కాచ్ పర్యటనలో కీట్సు కవి వలనే రెస్టారెంటు బయట నిలబడే బిచ్చగాళ్ళను, పారిస్ నగరంలో ఎంతో ప్రయాసపడుతూ నడిచే ముసలి అవ్వలను చూచినప్పుడు తన కెంతో బాధ కలుగుతుందంటాడు.
బాధ రెండు రకాలు అంటాడు బొదిలేర్. ఒకటి నీచస్థితి నుండి ఉచ్చస్థితికి తీసుకుపోగలిగితే ఇంకొకటి మనిషి దుర్మార్గునిగా క్రూరునిగా రూపొందిస్తుంది. మొదటిది ఆత్మీయమూ రెండోది పరకీయమూను. మొదటిరకం బాధ ఆధ్యాత్మికోన్నతికి దారితీస్తే రెండోరకం బాధ పశుత్వంలోనికి మళ్ళిస్తుంది. బొదిలేర్ ఒక ఉత్తరంలో రెంటికోసం ప్రార్ధిస్తాడు.ఒకటి తనకు జీవించే శక్తికావాలని, రెండు తల్లికి దీర్ఘాయుష్షు కావాలని; జీవిత నివృత్తిని బొదిలేర్ నిరసిస్తాడు.జీవన పరిస్థితులను అంగీకరించనివాడు తన ఆత్మని అమ్ముకుంటాడు. సమకాలీన సమాజమే రచయిత రచనలకు ఊపిరి.
బొదిలేర్ వ్రాసిన The Essence of Laughter నవ్వును, సేటానిక్ గా చెపుతూ యోగి నవ్వడంటాడు; తాత్త్వికుడైతే తప్ప. తననుండి వేరుపడగల శక్తి అలవడినప్పుడు నిర్లిప్తతతో పరిశీలకునివలె దర్సించగలడు, తనకు జరిగే సంఘటనలను.
కొందరు విమర్సకులు బొదిలేర్ ను నిరాశావాదిగా పేర్కొన్నారు. జగత్తంతా ప్రయాణం చేసినా ఒక్క వెలుగు రేఖ చూడలేకపోయేడన్నారు.
మూలాలు
మార్చు- ↑ * 1970 భారతి మాస పత్రిక.