చికెన్ బిర్యాని
'బొద్దు పాఠ్యం'వ౦కాయ==కావలసిన పదార్ధాలు==
- మాంసం - 1 కిలో,
- బాస్మతీ బియ్యం - 1 కిలో,
- ఉల్లిపాయలు -250 గ్రాములు,
- పెరుగు - 250 గ్రాములు,
- అల్లం వెల్లుల్లి ముద్ద - 3 టీ స్పూన్,
- కొత్తిమిర - 1/2 కప్పు,
- పుదీన - 1/2 కప్పు,
- పచ్చిమిర్చి - 3,
- పసుపు - తగినంత,
- కారం పొడి - 2 టీ స్పూన్,
- ఏలకులు - 4,
- లవంగాలు - 8,
- దాల్చిన - 2,
- షాజీర - 2 టీ స్పూన్,
- గరం మసాలా పొడి - 2 టీ స్పూన్,
- కేసర్ రంగు - 1/4 టీ స్పూన్,
- పాలు - 1 కప్పు,
- ఉప్పు తగినంత,
- నూనె - తగినంత.
తయారు చేయు విధానం
మార్చు- ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి పెట్టుకోవాలి.
- అలాగే తరిగిన కొత్తిమిర, పుదీనా కూడా. కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి.
- వేయించిన ఉల్లిపాయ, కొత్తిమిర, పుదీనా, పెరుగు, కారంపొడి, పసుపు, మాంసానికి తగినంతఉప్పు వేసి మిక్సిలో మెత్తగా ముద్ద చేసుకొనిపెట్టుకోవాలి.
- ఒక గిన్నెలో శుభ్రపరచిన మాంసం, నూరిన ముద్ద, పచ్చి కొత్తిమిర, పుదీనా, పచ్చిమిరపకాయలు, గరం మసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంట నాననివ్వాలి.
- బియ్యం కడిగి పదినిమిషాలు నాననిస్తే చాలు.
- మందపాటి గిన్నె తీసుకొని నూనె వేసి దానిమీద నానబెట్టిన మాంసం, మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకోవాలి.
- ఇంకో పెద్ద గిన్నెలో బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసి అన్నానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
- నీరు మరిగేటప్పుడు ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, షాజీర వేయలి. బియ్యంలోని నీరంతా వడకట్టాలి.
- మరుగుతున్న నీటిలో ఈ బియ్యం వేసి సగం ఉడకగానే గంజి వార్చి తర్వాత సగం ఉడికిన అన్నాన్ని మాంసంపై సమానంగా పరవాలి.
- పైన కొన్ని ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమిర, పుదీనా కొద్దిగా, నెయ్యి, పాలు, కేసర్ రంగు వేసి, తడిపిన గోధుమపిండిని చుట్టలాగా చేసుకుని గిన్నె అంచులపై మొత్తం పెట్టి దానిమీద సమానమైన మూత పెట్టాలి.
- పొయ్యిమీద ఇనప పెనం పెట్టి వేడి చేసి దానిపై ఈ గిన్నె పెట్టి దాని మీద బరువైన ఎదైనా వస్తువు పెట్టాలి.
- దీనివల్ల ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. అరగంట తర్వాత ఇది తయారై గోధుమ పిండిని చీల్చుకుని ఆవిరి బయటకొస్తుంది ఘుమఘుమలతో. ఉడికించిన గ్రుడ్లతో అలంకరించుకోవాలి.దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి, గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటాయి.