చిట్టాపద్దులు (ఆంగ్లం: Bookkeeping) అనగా ఆర్థిక లావాదేవీలను నమోదు చేయటం. వ్యాపారం యొక్క గణక శాస్త్రంలో భాగంగా చిట్టాపద్దులు నమోదు చేయబడతాయి. లావాదేవీలలో వ్యక్తిగత లేదా సంస్థాగత అమ్మకాలు, కొనుగోళ్ళు, రసీదులు, చెల్లింపులు ఉంటాయి. చిట్టాపద్దులు రెండు విధాలుగా లెక్కించవచ్చును.

పై రెండు విధాలు సిసలైన చిట్టాపద్దులుగా చెప్పబడిననూ, ఆర్థిక లావాదేవీలని నమోదు చేసే ఏ ప్రక్రియనైనా చిట్టాపద్దులు అనే అనవచ్చును.

చిట్టాపద్దులు వ్రాసే వ్యక్తి ఒక సంస్థలో ప్రతి ఆర్థిక లావాదేవిని ప్రతి దినము కేటాయింపబడ్డ దస్త్రంలో నమోదు చేసుకొంటూ ఉంటాడు. ఈ లావాదేవీలు అమ్మకాలు, కొనుగోళ్ళు, రశీదులు, చెల్లింపులకి సంబంధించనవై ఉంటాయి. అప్పుడే Accountant ఆర్థిక సంవత్సర అంతంలో తయారు చేసే నివేదికలు సరితూగుతాయి.