చిత్రనళీయం

(చిత్రనళీయము నుండి దారిమార్పు చెందింది)

చిత్రనళీయం లేదా నలదమయంతి 1938 జనవరి 12న విడుదలైన తెలుగు సినిమా. శ్రీరామా ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు దువ్వూరి రామిరెడ్డి దర్శకత్వం వహించాడు. శ్రీజంజని (సీనియర్), మాధవపెద్ది వెంకట్రామయ్య లు తారాగణంగా నటించిన ఈ సినిమాకు హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి సంగీతాన్నందించాడు.[1]

చిత్రనళీయం
(1938 తెలుగు సినిమా)
దర్శకత్వం దువ్వూరి రామిరెడ్డి
తారాగణం మాధవపెద్ది వెంకటరామయ్య,
రాళ్ళపల్లి నటేశయ్య,
శ్రీరంజని (సీనియర్)
సంగీతం హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
గీతరచన దువ్వూరి రామిరెడ్డి
నిర్మాణ సంస్థ శ్రీరాం ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: దువ్వురి రామిరెడ్డి
  • సంగీతం: హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి
  • గీత రచన: దువ్వురి రామిరెడ్డి
  • ఆర్ట్ డైరక్టరు: ఎన్.వి.ఎన్.రామారావు
  • బ్యక్ గ్రౌండ్ మ్యూజిక్: కె.సి.డే
  • అసిస్టెంట్ డైరక్టర్: ఏ.బాలన్

పాటలు[2] మార్చు

  1. నీవే నా ప్రాణపు ధనము శ్రీరంజని
  2. అతడు వరుణుడు యీతడు హవ్యవహుడు యముడితదు ( పద్యం )
  3. అరివీర కంఠనాళాస్ర నిర్ఝరముల స్నానమాడిన దారుణ౦పు ( పద్యం )
  4. ఇందు గల డందులేడని సందేహము వలదు నలుడు ( పద్యం )
  5. ఎన్నడు వచ్చునో జనకు డెచ్చట ఏగతి కష్టమొందెనో కన్నుల ( పద్యం )
  6. ఎన్నడు వచ్చునో నల మహీశుడు మున్నట్టియట్లు రాజ్య ( పద్యం )
  7. ఏగతి జీవితమో నాధా యొంటరిగా వనులన్ ప్రాణసమాన
  8. ఓ నల సార్వభౌమ రుచిరోజ్వలచారు శరీరకామ ( పద్యం )
  9. ఓరి మహోగ్ర కల్మషుడ యోరి దురాత్ముడ యోరి ద్రోహి ( పద్యం )
  10. కన్నులు కల్వ పూలు ఘనకాండముకేశభరంబు మోమునన్ ( పద్యం )
  11. కుసుమ కోమల దేహవు క్రూరమృగ భయంకరాటవి ( పద్యం )
  12. క్రూరుడసత్యవాక్ప్రియుడు కుంచిత చిత్తు డయోగ్యుడంచు ( పద్యం )
  13. గోరువెన్నెల యుద్యాన సౌరభంబు మంద పవనంబు ( పద్యం )
  14. చంచలంబగు జగతిలోన శాశ్వతంబొకటేదిరా కన్నుమూసి
  15. మందపవనంబు కోకిల మధుర ఋతము అలరుపూవులతావి ( పద్యం )
  16. మరణ మొకటి దప్ప మనల నొండెద్దియు ( పద్యం )
  17. మీరు వసియించు తలము కాంతారమైన నట్టనడిసంద్రాన ( పద్యం )
  18. మృధు మధురామృత మోహన వదనా జననీ జనక
  19. మొగంబులన రేవగల్ దిరిగి కడు దిగుల్ పడగ నేల
  20. విరహిణీ మనోవిదార సుమశర క్రూరా మహాపచార సరసిజరి
  21. చంద్రికా శీతలా వీచికల్ ఆశ్లేషము గూర్చేనే
  22. తులసిమాత సుమభరిత భువనతారణి  భుధజనావని
  23. దానవారి ఖలవిదారి దారి తారిదయగను హరి
  24. నల భూమీశుడు పుష్కరేశ్వరునకున్ రాజ్యంబు వోనాడి ( పద్యం )
  25. నలినభవుండు రూపమున నాకలతా౦గుల క్రిందుసేయు ( పద్యం )
  26. నిదురబోరా నాన్న నిదురపో తండ్రి నిదురపోకుంటేను నిన్ను
  27. నిషధ భూపాలకుడు కామినీ ప్రియుండు వీర వంశ ( పద్యం )
  28. నిషధపురంబు మానినదాదిగా నెట్టి పడరాని యిడుమల ( పద్యం )
  29. పరపురుషుల గననొల్లను పరగృహముల కేగబోన్ ( పద్యం )
  30. పరమపురుషులార కరుణార్ద్రమతులార భవ్యచరితులారా ( పద్యం )
  31. పాలపిట్ట తెచ్చీర బంగారిమామ నెమలికన్ను తెచ్చీర
  32. ప్రాణము పోవదేలా హృదార్తీ కోమలకాయ మెరియదేల
  33. ప్రాణవల్లభు దైవం పాలక పగది నమ్మి కన్నబిడ్డల ( పద్యం )

మూలాలు మార్చు

  1. "Chitranaliyam (1938)". Indiancine.ma. Retrieved 2021-06-09.
  2. "Wayback Machine" (PDF). web.archive.org. 2016-04-04. Archived from the original on 2016-04-04. Retrieved 2021-06-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు మార్చు