చినబాబు సుంకవల్లి

చినబాబు సుంకవల్లి (Eng:Chinababu sunkavalli) హైద‌రాబాద్ లో ప‌నిచేస్తున్న స‌ర్జిక‌ల్ ఆంకాల‌జిస్టు. ( కేన్స‌ర్ స‌ర్జ‌న్‌).ఆయ‌న గ్రేస్ కేన్స‌ర్ ఫౌండేష‌న్‌కు కార్య నిర్వాహ‌క అధికారి ( సిఇఓ) గా ప‌నిచేస్తున్నాడు[1] ఫౌండేష‌న్ త‌రుపున కేన్స‌ర్ వ్యాధిపై అవ‌గాహ‌న కోసం కేన్స‌ర్ ర‌న్ ల‌ను నిర్వ‌హిస్తున్నాడు.[2][3] రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ లో పనిచేశారు. ప్రస్తుతం, అతను 2022 ఆగస్టు 15 కేన్స‌ర్ రోబోటిక్ స‌ర్జ‌న్‌గా యశోద క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీలో సర్జికల్ ఆంకాలజీ క్లినికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన స్థాపించిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఈవెంట్‌ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల‌లో స్థానం సంపాదించింది.[4][5] డాక్టర్ చినబాబు సుంకవల్లి లి క్లినిక‌ల్ నైపుణ్యం కూడా  ఉంది, .జాతీయ‌, అంత‌ర్జాతీయ క్లిన‌క‌ల్ జ‌న‌రల్స్‌కు ఆయ‌న స‌మీక్షకుడిగా కూడా ఉన్నాడు.[6] వీటి జాబితాలో ఇండియ‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ స‌ర్జ‌రీ, ఆస్ట్రేలియా ఆసియ‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ కేన్స‌ర్ కూడా ఉన్నాయి. అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తొ క‌లిసి ప‌నిచేయ‌డంతో  ఆయ‌న‌కు  2009 లో లాంగ్ బీచ్ కేన్స‌ర్ సెంటర్ లో ఫెలోషిప్ ల‌భించింది.[7] గర్భాశయం, సర్విక్స్, అండాశయం, రొమ్ము, పెద్దప్రేగు, కడుపు, అన్నవాహిక, నోటి, కిడ్నీ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లకు శస్త్ర చికిత్స అందించడంలో డాక్టర్ చినబాబు సుంకవల్లి ప్రత్యేకత సాధించాడు.

విద్యా అర్హతలు మార్చు

దావ‌ణగేరేలోని  జెజెఎం వైద్య క‌ళాశాల నుంచి 2001 లో ఆయన వైద్య ప‌ట్టా పుచ్చుకున్నారు. సూర‌త్ లోని ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ విభాగంలో పోస్టు గ్రాడ్య‌యేష‌న్ చేశాక‌, అహ్మ‌దాబాద్ లో ఉన్న గుజ‌రాత్ కేన్స‌ర్ ప‌రిశోధ‌న కేంద్రం నుంచి ఆయ‌న సూప‌ర్ స్పెషాలిటీ శిక్షణ పొందారు.[8]

  • జపాన్‌లోని న్యూ టోక్యో హాస్పిటల్‌లో అధునాతన లివర్ సర్జరీ ఫెలోషిప్
  • ఫ్రాన్స్‌లోని పారిస్‌లో రోబోటిక్ సర్జరీ శిక్షణ
  • రోస్వెల్ పార్క్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, బఫెలో, USAలో రోబోటిక్ సర్జరీ శిక్షణ
  • మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, న్యూయార్క్, USAలో ఫెలోషిప్ శిక్షణ
  • లాంగ్ బీచ్ మెమోరియల్ హాస్పిటల్, LA, USAలో ఫెలోషిప్
  • ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ (PDCR)
  • మినిమల్లీ ఇన్వాసివ్ GI సర్జరీలో ఫెలోషిప్ (FIAGES)
  • MCH, సర్జికల్ ఆంకాలజీలో సూపర్ స్పెషాలిటీ, గుజరాత్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, అహ్మదాబాద్ (విశ్వవిద్యాలయం 2వ ర్యాంక్)
  • MS జనరల్ సర్జరీ, ప్రభుత్వ వైద్య కళాశాల, సూరత్ (గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ టాపర్)
  • MBBS, జగద్గురు జయదేవ మురుగరాజేంద్ర వైద్య కళాశాల (JJM వైద్య కళాశాల), దావణగెరె

అవార్డులు మార్చు

  • ది కింగ్ ఫౌండేషన్, 2022 ఆగస్టు ద్వారా ఉత్తమ వైద్యుడిగా అవార్డు
  • టైమ్స్ ఆఫ్ ఇండియా ద్వారా యంగ్ ఆంకాలజిస్ట్ ఆఫ్ ఇయర్, 2018

మూలాలు మార్చు

  1. "ఆరోగ్యశ్రీలో మరో 106 వ్యాధులకు చికిత్స | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2023-01-02.
  2. "Hyderabad Foundation Sets 2 Guinness World Records for Largest Cancer Awareness Initiative". News18 (in ఇంగ్లీష్). 2020-10-29. Retrieved 2023-01-02.
  3. Hussain, Mohammed (2020-05-21). "Grace Cancer Foundation launches 'Mobile COVID ICU' in India". The Siasat Daily (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-02.
  4. "Grace Cancer Foundation". Guinness World Records (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-01-02.
  5. "TEDxHyderabad | TED". www.ted.com. Retrieved 2023-01-02.
  6. https://www.researchgate.net/scientific-contributions/Chinna-Babu-Sunkavalli-43412784
  7. M, Sunil (2020-06-02). "Dr. Chinnababu Sunkavalli". Telugu Christian Fellowship of Colorado (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-02.
  8. "Dr. Chinnababu Sunkavalli , Surgical Oncologist in Hyderabad, India - Appointment | Vaidam.com". www.vaidam.com. Retrieved 2023-01-02.