చినుకులా రాలి.. నదులుగా సాగి....

చినుకులా రాలి నదులుగా సాగి పాట నాలుగు స్తంభాలాట (1982) సినిమా లోనిది. ఈ సినిమాకు రాజన్ - నాగేందర్ గారు సంగీతాన్ని అందించగా,, ఈ పాట, వేటూరి సుందరరామ్మూర్తి గారి కలం నుండి జాలువారగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల గారు ఆలపించారు.

నాలుగు స్తంభాలాట సినిమా పోస్టరు

ఈ సినిమాలో నరేష్, పూర్ణిమా, ప్రదీప్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి (జంధ్యాల) గారు దర్శకత్వం వహించారు.

పల్లవి:

చినుకులా రాలి...నదులుగా సాగి..........

వరదలై పోయి...కడలిగా పొంగు......

నీ ప్రేమ.....నా ప్రేమా..నీ పేరే... నా ప్రేమ

నదివి నీవు ..కడలి నేను....

మరిచి పోబోకుమా.....మమత నీవే సుమా!

చినుకులా రాలి...నదులుగా సాగి..........

వరదలై పోయి...కడలిగా పొంగు......

నీ ప్రేమ.....నా ప్రేమా..నీ పేరే... నా ప్రేమ

చరణం:1

ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే..

కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే..

ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే

జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే... వెల్లువౌతానులే...

హిమములా రాలి ... సుమములై పూసి

ఋతువులై నవ్వి... మధువులై పొంగి..

నీ ప్రేమ.. నా ప్రేమ.. నీ పేరే నా ప్రేమ...

శిశిరమైనా.. శిథిలమైనా విడిచి పోబోకుమా... విరహమై పోకుమా!

చరణం:2

తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్ననులే...

పులకరమూదే పువ్వుల కోసం వేసారుతున్నానులే..

నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే..

పున్నమి నేడై రేపటి నీడై ఆ ముద్దు తీరాలిలే ...ఆ తీరాలు చేరాలిలే..

మౌనమై వెలసి... గానమై పిలిచి...

కలలతో అలసి...గగనమై ఎగసి...

ఈ ప్రేమ.. నా ప్రేమ... తారాడే మన ప్రేమ...

భువనమైనా...గగనమైనా...ప్రేమ మయమే సుమా...ప్రేమ మనమే సుమా!

చినుకులా రాలి...నదులుగా సాగి..........

వరదలై పోయి...కడలిగా పొంగు......

నీ ప్రేమ.....నా ప్రేమా..నీ పేరే... నా ప్రేమ

నదివి నీవు ..కడలి నేను....

మరిచిపోబోకుమా.....మమత నీవే సుమా!


వివరణ:

ఎంత పెద్ద నది అయిన, ఒక నీటి బొట్టు తోనే మొదలవుతుంది. ఆ చినుకులే నదులుగా మారి, వరదలా ముంచి, కడలిలో కలిసిపొతుంది. అలాగే ప్రేమ కూడా మనసులో ఏ మూలో మొదలై హృదయంతా చేరి, చివరకి ప్రేమించిన వాళ్ళ మదికి చేరిపోతుంది. అప్పటి వరకు అనుకున్న నీ ప్రేమ, నా ప్రేమ కాస్త, మన ప్రేమగా మారిపోతుంది. ప్రేమ ప్రణయంగా మారి, పరిణయం అయ్యేలోపు, నిట్టూర్పు, ఒదార్పు, విరహం, అధరాల స్నేహం, ఇలా ఈ జీవితం ఎన్నో పేజీలను చదివేస్తుంది.