చిన్నారి (సినిమా)
చిన్నారి 2016లో విడుదలైన ఒక డబ్బింగ్ తెలుగు చిత్రము. ఇది భయానక నేపథ్యం కలది. ఈ చిత్రం కన్నడ సినిమా మమ్మీ కి తెలుగు అనువాదము.[1]
కథ
మార్చుప్రేమించి పెళ్ళి చేసుకున్న ప్రియ (ప్రియాంక ఉపేంద్ర), ఓ ప్రమాదంలో తన భర్తను కోల్పోతుంది. ప్రియ భర్తకు గోవాలో ఓ విల్లా ఉంటుంది. ప్రియ భర్త చనిపోక ముందు ప్రియతో కలిసి ఆ భవంతిలో నివసించాలనుకుంటాడు. అయితే ప్రమాదవశాతు భర్త చనిపోయిన తర్వాత తన భర్తకు ఇష్టమైన ఓ భవంతిలో ఉండటానికి తన కూతురు క్రియ (యువిన పార్థవి)తో కలిసి భవంతిలోకి వెళుతుంది. క్రియకు బొమ్మలంటే పిచ్చి. విల్లాలోని సామానులు నిల్వ చేసే గదిలో ఓ బొమ్మను క్రియ ఇష్టపడుతుంది. బొమ్మ ఇంట్లోకి రావడంతో పాప ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎవరితోనో మాట్లాడుతూంటుంది. కూతురు ప్రవర్తనకు భయపడ్డ ప్రియ మానసిక వైద్యుడు జేమ్స్ (శ్రీధర్)ను ఇంటికి పిలిపిస్తుంది. విల్లాకు వచ్చిన జేమ్స్‌ను ఎవరో చంపేస్తారు. దాంతో ప్రియ భయం ఎక్కువవుతుంది. ప్రియకు సహాయం చేయడానికి చర్చి ఫాదర్ మోజిస్ (మధుసూదన్) విల్లాకు వస్తాడు. మోజిస్‌కు విల్లా గురించి ఎలాంటి నిజాలు తెలుస్తాయి. అసలు ప్రియ భయానికి కారణం ఎవరు? క‌్రియ ఎవరితో మాట్లాడుతూంటుంది? అనే విషయాలు మిగిలిన కథలో భాగం.
తారాగణం
మార్చు- ప్రియాంక ఉపేంద్ర
- యువిన పార్థవి
- ఐశ్వర్య శిండోగి
- మధుసూదన్‌రావ్
- శ్రీధర్
- వత్సల
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాణ సంస్థలుః కె.ఆర్.కె. ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్
- సంగీతంః బి. అజనీష్ లోక్‌నాథ్
- చాయాగ్రహణంః హెచ్.సి.వేణు
- నిర్మాతః మహేశ్వర్ రెడ్డి
- దర్శకత్వంః లోకేష్
మూలాలు
మార్చు- ↑ "Priyanka in Conjuring-style horror flick". The Times of India. Retrieved 2015-04-08.
బయటి లంకెలు
మార్చు- ఫేస్బుక్ లో చిన్నారి (సినిమా)
- చిన్నారి (సినిమా) టీజర్ యూటూబ్