ఈ శతకము[1] కూచిమంచి తిమ్మకవిచే రచింపబడి 1923లో చెలికాని లచ్చారావుచే సంకలించబడిన శతకములు రెండవ సంపుటిలో చోటు చేసుకున్నది. భక్తి ప్రధానమైన శతకము. లౌకిక విషయాలు కూడా చర్చింపబడ్డాయి. చంపకమాలా సురభిళములైన 101 పద్యాలు ఈ శతకంలో ఉన్నాయి. 5 పద్యాలు అలభ్యములు. చిరవిభవా! భవా! విజిత చిత్తభవా! అనే మకుటం ఈ శతకానికి ఉంది. ఈ శతకము శ్రీరామవిలాస ముద్రాక్షరశాల, చిత్రాడలో ముద్రించబడింది.

చిరవిభవ శతకము
కవి పేరుకూచిమంచి తిమ్మకవి
మొదటి ప్రచురణ తేదీ1923
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంచిరవిభవా! భవా! విజిత చిత్తభవా!
విషయము(లు)భక్తి
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుచంపకమాలా వృత్తము
ప్రచురణ కర్తచెలికాని లచ్చారావు
ప్రచురణ తేదీ1923
మొత్తం పద్యముల సంఖ్య101
ముద్రణా శాలశ్రీరామవిలాస ముద్రాక్షరశాల, చిత్రాడ

ఉదాహరణ

మార్చు

లోభులైన ప్రభువులు కవి ఏమేమి అడుగుతాడో, ఎక్కడ అతనికి దానమివ్వవలసి వస్తుందో అనే భయంతో అతనికి దర్శనమివ్వరనే భావం వచ్చే పద్యం ఇందులో ఉంది.

చ|| ఒరిమెఁ గవీంద్రుఁడే మెఱుఁగునో యని దర్శన మియ్యనోడి బ
ల్దొరలును మూల నీఁగుదురు లోభమున న్నిను నేమ ఱేమియు
న్వరములు వేఁడ నాకిపుడు వైళమ దర్శన మియ్యరాగదే
చిరవిభవా! భవా! విజిత చిత్తభవా! యభవా! మహాభవా!

మూలాలు

మార్చు
  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973