ఈ పత్రిక పక్షపత్రికగా వెలువడింది. కంచి వాసుదేవరావు సంపాదకుడు, ప్రచురణకర్త. మచిలీపట్నం నుండి ఈ పత్రిక వెలువడేది. ఈ పత్రిక తొలి సంచిక 1959లో వెలుగు చూసింది. ఈ పత్రికలో కథలు, కవితలు, వ్యాసాలు సినిమా సమీక్షలు, గ్రంథ సమీక్షలు, రాజకీయ వ్యాఖ్యలు ప్రచురింపబడ్డాయి. 1967 నుండి ఈ పత్రికకు కాశీనాథుని సుబ్రహ్మణ్యము సంపాదకునిగా వ్యవహరించి హైదరాబాదు నుండి వెలువరించాడు. ఈ పత్రిక 1970 సెప్టెంబరు నుండి వారపత్రికగా రూపాంతరం చెందింది.

చుక్కాని
చుక్కాని
రకంజాతీయ పక్షపత్రిక
రూపం తీరుడెమీ ఆక్టోవా
ప్రచురణకర్తకంచి వాసుదేవరావు
సంపాదకులుకంచి వాసుదేవరావు
స్థాపించినది1959
భాషతెలుగు
కేంద్రంమచిలీపట్నం

09-06-1973 సంచిక[1]లో ఈ క్రింది విషయాలు ఉన్నాయి.

 • సంపాదకీయము : సదవకాశం
 • గుసగుసలు - రాధాయి
 • వారఫలాలు
 • నేను స్త్రీని - శ్రీశా
 • డైరీలో ఓ పేజీ - సుధామ
 • తీరని కోరికలు ఫలించని ఆశలు - సుధామిత్ర
 • ఇల్లాలి ఆంతర్యం - జి.కిరణకుమారి
 • కాకారావు - బి.విద్యాసాగర్
 • కవితలు:-
 • యువతరం - నిమ్మల అర్జున్‌గౌడ్
 • కల్లోల ఆంధ్ర ఆర్తనాద విజ్ఞాపన - నాగభట్ట శ్రీరామమూర్తి
 • రాజకీయ వలయాలు
 • నీకు - నాకు - చలం
 • సినిమా:
 • తల్లి కొడుకులు
 • విచిత్ర వివాహం

మూలాలు

మార్చు
 1. "ప్రెస్ అకాడెమీ ఆర్కీవ్స్‌లో పత్రిక ప్రతి". Archived from the original on 2016-03-05. Retrieved 2022-01-01.
"https://te.wikipedia.org/w/index.php?title=చుక్కాని&oldid=3441299" నుండి వెలికితీశారు