చెద లేదా చెదపురుగు (ఆంగ్లం Termites) ఒక విధమైన కీటకాలు. వీటిని సాధారణంగా తెల్ల చీమలు (White ants) అని పిలిచినా, ఇవి నిజమైన చీమలు కావు. చెదపురుగులు సాంఘికంగా జీవించే కీటకాలలో ఒకటిగా ఐసోప్టెరా (Isoptera) క్రమంలో వర్గీకరిస్తారు. అయితే నిజంగా సాంఘికంగా జీవించే కీటకాలన్నింటినీ హైమెనోప్టెరా క్రమంలో ఉంచుతారు.

చెదలు
Temporal range: Late Triassic - Recent
Formosan subterranean termite soldiers (red colored heads) and workers (pale colored heads).
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Subclass:
Infraclass:
Superorder:
Order:
కుటుంబాలు

Mastotermitidae
Kalotermitidae
Termopsidae
Hodotermitidae
Rhinotermitidae
Serritermitidae
Termitidae

చెదపురుగు రెక్క

ఇవి ఎక్కువగా చనిపోయిన వృక్ష సంబంధ పదార్ధాలపై జీవిస్తాయి. ముఖ్యంగా కలప, ఎండిన ఆకులు, మట్టి, జంతువుల పేడ వీని ఆహారం. గుర్తించబడిన 4,000 జాతులలో సుమారు 10 శాతం చెద పురుగులు మాత్రమే వాణిజ్యపరంగా ప్రాముఖ్యమున్నవి. ఇవి కట్టడాలకు, పంటలకు, అడవులకు నష్టం కలిగిస్తాయి. ఉష్ణ ప్రాంతాలలో చెద పురుగులు పర్యావరణ పరిరక్షణలో మృతిచెందిన వృక్ష సంబంధమైన వాటిని తిరిగి భూమిలోకి చేరుస్తాయి.

చెదపురుగు
"https://te.wikipedia.org/w/index.php?title=చెదలు&oldid=3848219" నుండి వెలికితీశారు