చెన్నకేశవ శతకము

(చెన్నకేశవ శతకం నుండి దారిమార్పు చెందింది)

చెన్నకేశవ శతకం రామడుగు సీతారామశాస్త్రి రచించిన శతకం. ఇది 1944లో ముద్రించబడింది.

చెన్నకేశవ శతకము
కవి పేరురామడుగు సీతారామశాస్త్రి
దేశంభారత దేశము
భాషతెలుగు
మకుటంచెన్నకేశవా!
పద్యం/గద్యంపద్యములు
ఛందస్సువృత్తములు
మొత్తం పద్యముల సంఖ్య100
మొత్తం పుటలు34
శతకం లక్షణంభక్తి శతకం

విశేషాలు మార్చు

శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. "చెన్నకేశవా!" అనే మకుటంతో ఈ పద్యాలను రచించారు.ఇందుకోసం నల్లమోతు కృష్ణయ్య ధనసహాయం చేయగా రచయిత పుత్రుడు రామడుగు సత్యనారాయణ శాస్త్రి సంపాదకత్వం వహించాడు. ఇది 1944లో ముద్రించబడినది.[1]

పద్యాలు మార్చు

మొదటి పద్యం

శ్రీరమణీ మనః కుముద శీతమయూఖ! విరించిముఖ్య బృం
దారక వారచారుతర నవ్యకిరీటమణీ ఘృణీఝరీ
పూర విరాజమాన పదపుష్కరజాత! నమో స్తుతే లస
న్నీరదనీలగాత్ర! ధరణీభరణక్షమ! చెన్నకేశవా!

మూలాలు మార్చు

  1. రామడుగు సీతారామశాస్త్రి (1944). చెన్నకేశవ శతకం.

బాహ్య లంకెలు మార్చు