చెవిలో రహస్యం అనే సినిమాను మహాకవిగా విఖ్యాతుడు, తెలుగు సినిమారంగంలో ప్రముఖ కవి శ్రీశ్రీ నిర్మించారు. 1950 నుంచి 1959 వరకూ సినీకవిగా సంపాదించి సొమ్ము ఈ సినిమాలో పెట్టి చాలా విపరీతమైన నష్టాలను ఆయన చవిచూశారు.[1]

చెవిలో రహస్యం
(1959 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ పీ.వీ.మాణిక్యం, ఉషశ్రీ పిక్చర్స్
భాష తెలుగు
శ్రీశ్రీ

'చెవిలో రహస్యం' 1959 డిసెంబర్ 19 న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.పి.శ్రీధర్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, అంజలీదేవి ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం జి.రామనాధన్ సమకూర్చారు .

తారాగణం

మార్చు

శివాజీ గణేశన్

అంజలీదేవి

నంబిరాజన్

తంగవేలు



సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: పి. శ్రీధర్ రావు

సంగీతం: జి.రామనాధన్

నిర్మాణ సంస్థ: కస్తూరి ఫిలింస్

సాహిత్యం: శ్రీరంగo శ్రీనివాసరావు

నేపథ్య గానం: మాధవపెద్ది, పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, పి.లీల, ఎం.రామం, పిఠాపురం, ఘంటసాల .

విడుదల:19:12:1959.

పాటల జాబితా

మార్చు

1.ఆ చెవిలో రహస్యం ఈ చెవిలో రహస్యం, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.మాధవపెద్ది సత్యం

2.కనిపెంచి చల్లగా కాచు తల్లిదండ్రుల , రచన: శ్రీ శ్రీ , గానం.పులపాక సుశీల

3.చెలరేగి వూగి సాగేనే ఆశాజ్యోతియే, రచన: శ్రీ శ్రీ , గానం.పి . సుశీల, ప్రతివాది భయంకర శ్రీనివాస్

4.పెళ్లాడే పుత్తడి బొమ్మా పెళ్లాడే బంగారు బొమ్మా, రచన: శ్రీ శ్రీ , గానం.పి.లీల

5.రాదేదయ న్యాయమా మాతా ఆదరణే దూరమా, రచన: శ్రీ శ్రీ , గానం.పి.సుశీల

6.విడరాదే రాణి విడరాదే విసిగిపోయినా, రచన: శ్రీ శ్రీ , గానం.ఎం.రామం, పిఠాపురం నాగేశ్వరరావు

7.తల్లిలేని కొరత సుంతయులేని రీతిగా,(పద్యం), రచన: శ్రీ శ్రీ , గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు.

మూలాలు

మార్చు
  1. రాధాకృష్ణ, బూదరాజు (1999). మహాకవి శ్రీశ్రీ (ప్రథమ ముద్రణ ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ. ISBN 81-260-0719-2.

. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.