చెవుడు

శబ్దాలను పూర్తిగా లేదా పాక్షికంగా వినలేకపోవడం అనే లక్షణం

చెవుడు, చెముడు లేదా చెవిటితనం (Deafness or Hearing impairment) అనగా శబ్దాలను పూర్తిగా లేదా పాక్షికంగా వినలేకపోవడం.[1]దీనికి చాలా విధాల జీవసంబంధ, పర్యావరణ కారకాల వలన ఏర్పడుతుంది.

చెవిటితనం
వర్గీకరణ & బయటి వనరులు
[[Image:Center
Caption    = The International Symbol for Deafness 
DiseasesDB   = 19942|190px|center|]]
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
MeSH {{{m:en:MeshID}}}

చెముడు రకాలు

మార్చు
  • కర్ణభేరిలో రంధ్రం వల్ల కర్ణభేరికి అనుసంధానంగా మధ్య చెవిలో ఉండే మూడు గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, మధ్య చెవి నుంచి ముక్కుకు ఉండే యూస్టేషన్‌ ట్యూబు మూసుకుపోయి చెవిలో ద్రవాలు, జిగురు వంటి పదార్థాలు పేరుకుపోవటం, మధ్యచెవిలో కణుతులు రావటంవల్ల
  • అంతర్‌ చెవిలోని శ్రవణనాడులు బలహీనపడటం, కొన్ని రకాల మందులు వాడినప్పుడు ఈ నాడులు దెబ్బతినటం తదితర కారణాల వల్ల
  • మెదడులో వినికిడికి సంబంధించిన కేంద్రం దెబ్బతినటం వల్ల .

వినికిడి యంత్రాలు

మార్చు
  • ప్రోగ్రామింగ్‌: వినికిడి యంత్రాన్ని ఆడియాలజిస్టులు చెవుడుకు తగ్గట్టుగా ప్రోగ్రామింగ్‌ చేస్తారు.
  • చెవి వెనకాల పెట్టుకునే చిన్నచిన్న, శక్తిమంతమైన యంత్రాలు
  • వినికిడి లోపం 75 డి.బి. కంటే ఎక్కువ ఉన్నవారికి 'కాక్లియర్‌ ఇంప్లాంట్‌

గుర్తించే పరీక్షలు

మార్చు

వ్యక్తి స్పందించి చెబుతున్న దాన్ని గుర్తించేవి (సబ్జెక్టివ్‌ పరీక్షలు). వ్యక్తి స్పందనలతో ప్రమేయం లేకుండా వినికిడి ఎంత ఉందన్నది అంచనా వేసేవి (ఆబ్జెక్టివ్‌).

  • బెరాటెస్ట్‌: ఆరు నెలల నుంచి ఏడాది లోపు పిల్లల్లో వినికిడి సమస్యను బెరా (బ్రెయిన్‌స్టెమ్‌ ఇవోక్‌డ్‌ రెస్పాన్స్‌డ్‌ ఆడియోమెట్రీ) పరీక్ష ద్వారా గుర్తిస్తారు.
  • ఇంపిడెన్స్‌ టెస్ట్‌: మధ్య చెవిలో ఏవైనా సమస్యలుంటే అదేమిటన్నది దీని ద్వారా తెలుస్తుంది.
  • ప్యూర్‌టోన్‌ పరీక్ష: చెవులకు హెడ్‌ ఫోన్స్‌ పెట్టి, రకరకాల పౌనఃపున్యాల శబ్దాల తీవ్రతను బట్టి వినికిడి స్థాయి గుర్తించి గ్రాఫ్‌ను రూపొందిస్తారు.

మూలాలు

మార్చు
  1. "Speech and Language Terms and Abbreviations". Archived from the original on 2009-09-05. Retrieved 2006-12-02.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=చెవుడు&oldid=4279396" నుండి వెలికితీశారు