1980 ఆగష్టు 7న జన్మించిన చేతన్ ఆనంద్ (ఆంగ్లం: Chetan Anand) భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 2004లో ఇతడు ఫ్రాన్స్ లోని టౌలోస్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ లో విజయం సాధించాడు. 2005లో ఐరిష్ ఇంటర్నేషనల్, వెల్ష్ ఇంటర్నేషనల్, శ్రీలంక శాటిలైట్ లలో విజయం పొందినాడు. 2007లో పాట్నాలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్ లో ఫైనల్ లో ఆనంద్ పవార్ను ఓడించి టైటిల్ చేజిక్కించుకున్నాడు. ఇదే సంవత్సరంలో సైప్రస్ ఇంటర్నేషనల్ లో సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్ళను గెలుపొందాడు. 2007 అక్టోబర్ 11 నాటికి అతని ర్యాంకు 39.

చేతన్ ఆనంద్

వివాహము

మార్చు

గుత్తా జ్వాలతో విడిపోయిన తర్వాత 2012 అక్టోబర్ 25న శారద గోవర్ధినిని చేతన్ పెళ్లాడాడు. ఆయన భార్య శారదా గోవర్ధిని 2013 డిసెంబరు 8న ఆడపిల్లకు జన్మనిచ్చారు. 'డిసెంబరు 8న నాకు పాప పుట్టింది. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు' అని చేతన్ అన్నాడు. తనకు ఆడపిల్లే కావాలనుకున్నానని చెప్పాడు. దేవుడు తన కోరిక నెరవేర్చాడని, ఆయన ఎంతో రుణపడివున్నానని తెలిపాడు.తన పుట్టినరోజునే కూతురు పుట్టడం అత్యంత సంతోషాన్ని ఇస్తోందని వెల్లడించాడు. ఇది యాధృచ్చికమైనా అత్యంత ఆనందాన్ని కలిగిస్తోందని అన్నాడు. ఈ పుట్టిన రోజున తన భార్య ఇచ్చిన కానుకగా వర్ణించాడు. తన కూతురు తమ జీవితంలోకి మరింత సంతోషాన్ని తీసుకొచ్చిందని వ్యాఖ్యానించాడు. తన కూతురిని మొదటిసారి ఎత్తుకున్నప్పుడు అర్వచనీయ అనుభూతి కలిగిందన్నాడు. తన ముఖంలో నవ్వులు పూశాయని పేర్కొన్నాడు.

బయటి లింకులు

మార్చు