చేతిరాత

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

చేతిరాత అంటే చేతిలో పెన్ను లేదా పెన్సిల్ వంటి రాత పరికరంతో చేసే రాత. మనిషి అంతఃసౌందర్యాన్ని, ప్రవర్తనను ఆలోచనల్ని అంచనావేయడానికి చేతిరాత ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.[1] చేతిరాతలను, సంతకాలను విశ్లేషించే పద్ధతినే గ్రాఫాలజీ అంటారు. దస్తూరీ, సంతకాలను బట్టి మనుషుల స్వభావాలను, వ్యక్తిత్వాలను అంచనా వేస్తారు. కలిపి వ్రాత లేదా కర్సిన్ అనేది వేగంగా వ్రాయడానికి ఉపయోగించే ఒక రాత. కలిపిరాతను గొలుసుకట్టు వ్రాత, పూసకుట్టు రాత అని కూడా అంటారు. చేతిరాతలో ముద్రణారాత, కలిపిరాత రెండూ ఉంటాయి. సాంప్రదాయిక కాలిగ్రఫీ లేదా టైప్ ఫేస్ ల కంటే ఇది విభిన్నంగా ఉంటుది. వ్యక్తి శారీరక, మానసిక స్థితితో కూడిన వైయక్తిక వ్యత్యాసాలవల్ల ఏ ఇద్దరు వ్యక్తులకు చెందిన చేతిరాతలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు.[2]

చేతిరాత అనేది చిత్రలేఖనం, నాట్యం లాంటి నేర్చుకునే కళ. రాతను నేర్చుకోవడం, సాధన చేయడంతో కూడుకొన్న తొలి విద్యార్థి దశలలో ప్రామాణిక అక్షర రూపాలను కాపీ చేయడం స్పష్టమైన విధానం. విద్యార్థి, నమూనాకు చెందిన మానసిక ముద్రను ముందుంచుకుని దాన్ని రాతగా తన చేతి కండరాలద్వారా అనువదించడానికి ప్రయత్నిస్తాడు.

నమూనాకు రాత లక్షణాలను కచ్చితంగా, సంపూర్ణంగా పునరుత్పత్తి చేయడం వీలవదు. కోణీయత, వాలు, వేగం, వత్తిడి, అక్షరానికి అక్షరానికీ మధ్య ఎడం, పదానికి పదానికీ మధ్య ఎడం, సాపేక్షంగా అక్షరాల పరిమాణాలు, అక్షరాలను కలిపిన విధానం, కలం కదలిక, రాత నైపుణ్యం, గీత నాణ్యత మొదలైన అంశాలలో వ్యత్యాసాలుంటాయి. అంతేకాకుండా మార్జిన్లు, ఎడం, క్రెడింగ్, చొప్పించడాలు, అలైన్మెంట్, వర్ణక్రమం (స్పెల్లింగ్), తరవాత కౌశలం అబ్బుతుంది. రాతకు కూడా నిశ్చితరూపం ఏర్పడుతుంది. ఆ తరవాత ప్రయత్నం స్వరూపాన్ని మనస్సు గ్రహించలేదు. అలాగే కండరాల ద్వారా నమూనాను కచ్చితంగా పునరుత్పత్తి చేయడం జరగదు. ఈ రెండు విషయాలలోనూ వ్యత్యాసాలుంటాయి. ఈ మానసిక, కండర వ్యత్యాసాలవల్ల నాడి-కండర చర్య విధానం ఏర్పడి, రాతకు ఒక ప్రత్యేకత సిద్ధిస్తుంది. ఒక వ్యక్తికి విలక్షణమైన చేతిరాత, అనేక ప్రభావాన్వితమైన అంశాల ఫలితమే.

ఈ అంశాలలో ఒక్కొక్కటి రాత తుదిరూపానికీ శైలికీ లక్షణాలకూ దోహదం చేస్తుంది.

వీటిని మౌలికంగా కింది అంశాలు నిర్ధారిస్తాయి.

(1) మొదట్లో నేర్చుకొన్న రాత విధానం

(2) కాలక్రమంలో చేతిరాత అనుభవం, వినియోగ పరిస్థితులు

(3) అస్వస్థత, గాయంవల్ల ఏర్పడిన శారీరక అసాధారణ పరిస్థితులు లేదా లోపాలు, మానసిక వ్యత్యాసాలు, ఇతర సామాన్య పరిస్థితులు ఉండటం లేదా లేకపోవడం.

చేతివ్రాత యొక్క కొన్ని లక్షణాలు[3]

మార్చు

పంక్తుల మద్య ఖాళి: పంక్తులు ప్రవహిస్తూన్నాయా లేక అవి అస్థిరంగా ఉన్నాయా అనేది రాత వేగాన్ని సూచిస్తుంది

పదాలు వాటి మద్య ఖాళీలు: అక్షరాలు, పదాల మధ్య ఖాళీలు సమానంగా ఉన్నాయా, లేదా అవి కలిసి ఉన్నాయా?

అక్షర పరిమాణం: ప్రతి అక్షరం ఎత్తు, వెడల్పుల నిష్పత్తి స్థిరంగా ఉందా?

కలం వాడకం: రచయిత కాగితం నుండి పెన్ను ఎత్తివేస్తారా లేదా రచన నిరంతరంగా ఉందా? కలాన్ని ఎక్కువగా ఎత్తి పెడుతూ ఉంటే అనుకరణను సూచిస్తుంది - ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వారి సహజ చేతివ్రాతను మార్చడం లేదా మరొకరి చేతిరాతను కాపీ చేయడాన్ని ఇది సూచిస్తుంది.[ఆధారం చూపాలి]

అక్షరాలను కలిపి రాయడం: అక్షరాలు ఒకదానితో ఒకటి కలిసి నిరంతరాయంగా ఉన్నాయా?

అక్షరం రూపు: అక్షరాలు పూర్తిగా ఉన్నాయా, లేదా కొంత భాగం లేకుండా ఉందా?

కలం ఒత్తిడి: పైకి, క్రిందికి స్ట్రోక్‌లకు కల ఒత్తిడి (పెన్ ప్రెజర్) సమానంగా ఉందా? ఒత్తిడి ఎప్పుడు పడుతోంది?

అక్షరం వాలు: అక్షరాలు ఎడమవైపుకు లేదా కుడివైపుకు వంగి ఉన్నాయా? లేదా ఎలా మారుతున్నాయి?

మూలాధార అలవాట్లు: కాగితం యొక్క బేస్‌లైన్‌లో, రేఖకు పైన లేదా రేఖకు దిగువన ఉన్న రచన ఉందా?

అలంకారాలు: రాతలో అందం కోసం వంపులు, వయారాలూ లేదా ఏదైనా అసాధారణమైన అలంకారాలు ఉన్నాయా?

రాతను ప్రభావితం చేసే అంశాలు

మార్చు

ఆర్జిత కళ అయిన చేతిరాతను అనేకమైన అంతర్గత, బహిర్గత అంశాలు ప్రభావితం చేస్తాయి వాటిలో కొన్ని

రచనా సామగ్రి: కాగితం, కలం, సిరా, పెన్సిల్, ఒత్తు, సీటు మొదలగునవి చేతి రాతల్లో వ్యత్యాసాలకు దోహదం చేస్తాయి.

శారీరక లేదా మానసిక కల్లోలాలు: ఉత్తేజం, అస్వస్థత, భయం, బాధ, చేతులకైన గాయాలు, మత్తుమందులు లేదా ఆల్కహాల్ ప్రభావం వంటివి రాత లక్షణాలపై ప్రతికాల ప్రభావం కలగజేస్తాయి.

వయస్సు: కాలం గడిచే కొద్దీ రాత లక్షణాలలో కొన్ని మార్పులు వస్తాయి.. కొన్ని కొత్త లక్షణాలు సమకూరుతాయి, పాతవి పోతాయి. వృద్ధాప్యంలో అక్షరాల పొల్లులు తగ్గిపోవచ్చు. అక్షరాల రూపంలో తేడా రావచ్చు.

సహజ వైవిధ్యాలు: ఒకే వ్యక్తి రూపొందించిన రెండు రాత నమూనాలు, ప్రతి విషయంలోనూ ఒకే రకంగా ఉండవు. సహజమైన రాతలో వైవిధ్యం, సహజ సిద్ధమైన భాగంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఒకే పదాన్ని అనేకసార్లు రాసినట్లయితే లేదా సంతకాలను అనేకసార్లు చేసినట్లయితే సూక్ష్మాతి సూక్ష్మ వివరాలలో పునరుత్పత్తులు ఎప్పుడూ ఒకేరకంగా ఉండవు. అక్షరాల రూపం, సైజు, అనుపాతం, వాలు వంటి విషయాల్లో కొన్ని పరిమితులకు లోబడి ఉండే ఈ విచలనాలను సహజ వైవిధ్యాలంటారు.

మూలాలు

మార్చు
  1. https://www.ntnews.com/district/Medak/article.aspx?contentid=814665
  2. "Frequently asked questions on handwriting analysis | Handwriting Analysis" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-09-26. Retrieved 2020-09-10.
  3. "What are the 12 characteristics of handwriting?". The Pen Company Blog (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-10-03. Retrieved 2020-09-10.
"https://te.wikipedia.org/w/index.php?title=చేతిరాత&oldid=3851346" నుండి వెలికితీశారు