చేపల మార్కెట్ వివిధ రకాల చేపల అమ్మకం కోసం నిర్వహించబడుతున్న బజారు. ఇది మత్స్యకారులు, చేపల వ్యాపారుల మధ్య హోల్‌సేల్ వాణిజ్యానికి లేదా వ్యక్తిగత వినియోగదారులకు మత్స్య అమ్మకాలకు లేదా రెండింటికీ ఉపయోగ పడుతుంది[1]

బెంగుళూరులోలి హెచ్.ఎ.ఎల్ మార్కెట్లో చేపల అమ్మకం విభాగం

వాణిజ్య ప్రయోజనాలు

మార్చు

చేపల మార్కెట్ ఆధారంగా మత్స్య ఉత్పత్తులు పంపిణీ చేయబడతాయి. చేపల పట్టుకునే ప్రాంతంలో ఉత్పత్తి చేయబడిన పోర్ట్ మార్కెట్, పట్టణ వినియోగ ప్రాంతాల వినియోగ మార్కెట్ అనే రెండు దశల్లో ఈ మార్కెట్లు వేరు చేయబడతాయి, ఒక్కొక్కటి దాని స్వంత పంపిణీ పనితీరుతో ఉంటాయి. చేపల బజారు వాణిజ్యపరంగా చేపలు, చేపల ఉత్పత్తులు ఉండే ప్రదేశం. ఉత్పత్తి, ఉత్తమ సంభావ్య నాణ్యత, ప్యాకింగ్, బ్రాండ్ పేరు ధర ఉత్పత్తి, పెట్టుబడిపై మెరుగైన ఫలితాలను పొందడం కొరకు వినియోగదారులకుకొత్త ఉత్పత్తుల గురించి అవగాహన కొరకు ఇక్కడ ప్రకటనలు ఉంటాయి . మార్కెట్ మౌలిక సదుపాయాలలో హోల్ సేల్ మార్కెట్లు, రిటైల్ మార్కెట్లు, చేపల రిటైల్ అవుట్ లెట్ లు ఉంటాయి. చేపల చెరువుల, నదుల, సముద్రాల నుండి నుండి చేప వివిధ మధ్యవర్తుల లేదా రైతులనుండి నేరుగా చేపల బజారుకు వస్తుంది . వేలందారుడు, హోల్ అమ్మకందారు, రిటైలర్, లాండింగ్ సెంటర్ లేదా చేపల చెరువు నుంచి వెండర్ లకు , వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు మధ్య చేపల మార్కెట్లు వారధిగా ఉంటాయి. ప్రపంచంలో చేపలు ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. లోతట్టు చేపల ఉత్పత్తిలో రెండవది. 8118 కి.మీ తీరప్రాంతం, 52.66 లక్షల హెక్టార్లు జలాశయాలు, ట్యాంకులు, చెరువులు, 14.37 లక్షల హెక్టార్ల ఉప్పునీరు భారతదేశానికి చెందిన చేపల ఉత్పత్తి యొక్క విస్తారమైన వనరులు[2].

పరిశుభ్రత

మార్చు

చేపల బజారులు సాధారణముగా విరిసిన జనసముద్రముతో ఉండుటయే కాకుండా ఆవరణలో చేపల వ్యర్ధములతో నిండి మురుగు నీరు బయటకు పోయే సౌకర్యం లేక దుర్గంభముతో నిండియుండును.

చేపల బజారులను పరిశుభ్రముగా ఉంచాలి. పరిశుభ్రత లోపించినచో హానికర సూక్ష్మజీవులు విస్తారముగా వ్యాపించి చేపల శరీరములోనికి ప్రవేశించును. ఈ చేపలను కొనుగోలు చేసిన వినియోగించుట వలన వినియోగదారులు వ్యాధి గ్రస్తులవుతారు. చేపలు విక్రయించుట,

కొనుగోలు చేయుట లో తీసుకోవలసిన జాగ్రత్తలు

మార్చు

చేపలను కోయు సమయములోను, చేపలను ప్యాకింగు చేయు సమయములోను చేపల వేలము వేయు సమయములోను , అమ్మకము జరుగు సమయములో చేపలను ఎత్తు అయిన బల్లల మీద మాత్రమే ఉంచవలెను. ఈ బల్లలపై నుండి చేపలపై ఉన్న నీకు క్రిందికి జారిపోవునట్లు వాలుగా అమర్చవలెను . ప్రతిరోజు ఈ బల్లలను నీటితో మాత్రమే కడుగవలెను. ఫినాయలు , బ్లీచు వంటి రసాయనములను వాడరాదు. చేపలను ఉంచు తెరలను, పెట్టెలను శుభ్రముగా కడుగవలెను.[3] సాధ్యమైనంత వరకు చేపలను శుభ్రం చేసేటప్పుడు తినుటకు పనికిరాని భాగములను త్వరగా వేరుచేసి దూరముగా పారవేయవలెను.

భద్రపరచటం

మార్చు

చేపలను భద్రపరచుటకు మనము మంచు ముక్కలను వాడవచ్చు. ఈ మంచుముక్కలను వాడటం వలన అవి చెడిపోకుండా తాజాగా ఉంటాయి. అయితే మురికి, దుర్గంధములేని పరిశుభ్రమైన తాగదగిన మంచినీటితో తయారు చేసిన మంచు ముక్కలను మాత్రమే వాడవలెను. మంచు దిమ్మలను శుబ్రమైన పోలిథిన్ కవరుల మీద ఉంచవలెను. ఐస్ దిమ్మలను నేలపై ఈడ్చరాదు. ఐస్ దిమ్మలను నేలపై ముక్కలుగా చేయరాదు. ఐస్ రవాణాకు శుభ్రముగా కడిగిన ప్లాస్టిక్ తొట్టెలను వాడవలెను. ఈ బాక్స్ లో నలిగిన ఐస్ ముక్కలను మాత్రమే తీసుకెళ్లవలెను. చేపను పెట్టెలో ఉంచాలనుకున్నప్పుడు మాత్రమే ఐస్ బాక్స్ మూత ను తెరవాలి. మూత సరిగ్గా మూయబడి, ఎయిర్ ప్యాకేజీలను సీల్ చేసేవిధంగా ధృవీకరించుకోవాలి. ఒకవేళ నీరు కనిపించడం కొరకు బాక్స్ ని నియతానుసారంగా తనిఖీ చేస్తూండాలి[4].

మూలాలు

మార్చు
  1. "Fish market definition and meaning | Collins English Dictionary". www.collinsdictionary.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-07.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2022-06-25. Retrieved 2020-09-07.
  3. "NDLI Presents: Hygiene in fish market". ndl.iitkgp.ac.in. Retrieved 2020-09-07.
  4. http://www.fao.org/tempref/FI/CDrom/bobp/cd1/Bobp/Publns/ODA/0009.pdf

బాహ్య లంకెలు

మార్చు