చౌలపల్లి ప్రతాపరెడ్డి

చౌలపల్లి ప్రతాపరెడ్డి (Chowlapalli Pratap Reddy) మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను జూలై 7, 1956న[1] షాద్‌నగర్ మండలం దూసకల్ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. బి.కాం. వరకు విద్యనభ్యసించాడు. 1994లో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] 1995 స్థానిక సంస్థల ఎన్నికలలో షాద్‌నగర్ జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. 2002 నుండి 2004 వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2009 శాసనసభ ఎన్నికలలో షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 9838 ఓట్ల మెజారిటీతో[3] ఎన్నికయ్యాడు.

చౌలపల్లి ప్రతాపరెడ్డి
నియోజకవర్గము షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1956-07-07) 7 జులై 1956 (వయస్సు 64)
దూసకల్
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానము ఇద్దరు కుమారులు

కుటుంబంసవరించు

ప్రతాపరెడ్డి భార్య చరిత, ఈమె సాధారణ గృహిణి. అన్న కృష్ణారెడ్డి, వదిన అరుంధతి గ్రామ సర్పంచులుగా పనిచేశారు.

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 22-3-2009
  2. నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 31-7-2011
  3. స్థానిక పాలన, జూన్ 2009, పేజీ 21